మేమంతా వైయ‌స్ జ‌గ‌న్ వెంటే

 
 యువ బ్రాహ్మణ సంఘం నాయకులు వైయ‌స్ఆర్‌సీపీలో చేరిక
 

తూర్పుగోదావరి:  వైయ‌స్ఆర్‌ సీపీ అధినేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి వెంటే మేమంతా ఉండి పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తామని కాకినాడకు చెందిన యువ బ్రాహ్మణ సంఘ నాయకులు అన్నారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా కాకినాడ క్యాంపు కార్యాలయంలో వైయ‌స్‌.జగన్‌ సమక్షంలో యువ బ్రాహ్మ‌ణ సంఘం నాయ‌కులు వైయ‌స్ఆర్‌సీపీలో చేరారు. కాకినాడ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు, కో ఆర్డినేటర్‌ కురసాల కన్నబాబు ఆధ్వర్యంలో యువ బ్రాహ్మణ సంఘ నాయకులు ఆకెళ్ళ మురళీకృష్ణ, వీఆర్‌జె దిలీప్, భమిడిపాటి మూర్తి, ఎస్‌.విష్ణుమూర్తి, వేదుల మణిలతో పాటు 45 మంది వైయ‌స్‌ జగన్‌ సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీలో చేరిన వారికి వైయ్ జగన్‌ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయ‌స్‌ రాజశేఖరరెడ్డి హయాంలో అన్ని వర్గాల ప్రజలకు అందించిన సువర్ణ పాలన వైయ‌స్‌ జగన్‌తోనే సాధ్యమవుతుందన్నారు. పార్టీ ప్రవేశపెట్టిన నవరత్నాలు ఎంతో మంది పేద ప్రజలకు మేలు చేస్తాయన్నారు. పార్టీ సిద్ధాంతాలు, కార్యక్రమాలకు ఆకర్షితులమై పార్టీలో చేరామన్నారు. 


Back to Top