యువకులంతా బాబు గుండెల్లో రైళ్లు పరిగెత్తించాలి

నంద్యాలః వేలాదిమంది యువకులు శిల్పా మోహన్ రెడ్డికి మద్దతు ఇవ్వడం సంతోషంగా ఉందని వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. యువకులంతా చంద్రబాబు, భూమా బ్రహ్మానందరెడ్డికి అత్తారింటికి దారి చూపాలని ఎద్దేవా చేశారు. ఇక్కడి యువకులు ఎంతో సేవాభావం కలిగిన వారని అంబటి అన్నారు. నంద్యాలలో మీరు గెలిపించాలనుకుంటున్న శిల్పా మోహన్ రెడ్డి కూడ సేవా దృక్పథం కలిగిన వారని అన్నారు. ఉప్పొంగే ఉత్సాహంతో ఫ్యాన్ గుర్తుకు ఓటేసి శిల్పాను గెలిపించాలని కోరారు. యువకులంతా బాబు గుండెల్లో రైళ్లు పరిగెత్తించాలని విజ్ఞప్తి చేశారు.

Back to Top