వైయస్సార్సీపీలో చేరిన యువ నాయకులు

చిత్తూరు(రేణిగుంట))రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు వైయస్సార్సీపీని అమితంగా ఆదరిస్తున్నారు. వైయస్ జగన్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. దీనిలో భాగంగానే ప్రజాపోరాట నాయకుడు వైయస్ జగన్ కు మద్దతుగా నిలుస్తూ వైయస్సార్సీపీలో చేరుతున్నారు. చిత్తూరు జిల్లా రేణిగుంట మండలం మామండూరులో శ్రీకాళహస్తి నియోజకవర్గ సమన్వయకర్త బియ్యపు మధుసూదన్ రెడ్డి సమక్షంలో పెద్ద ఎత్తున యువకులు పార్టీలో చేరారు. మధుసూదన్ రెడ్డి వీరందరికీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గ్రామస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు చిత్తశుద్ధితో కృషిచేస్తామని యువకులు తెలిపారు.

Back to Top