వైయస్సార్సీపీలో చేరిన యువకులు

  • వైయస్‌ ఆశయాల సాధనకు కృషి చేయాలి
  • వైయస్సార్‌సీపీ తెలంగాణ ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు
బెజ్జంకి: పేదల సంక్షేమం కోసం దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి ఎంతో కృషి చేశారని, ఆయన ఆశయ సాధనకు అంతా కృషి చేయాలని వైయస్సార్‌ సీపీ తెలంగాణ ప్రధాన కార్యదర్శి బోయినిపల్లి శ్రీనివాస్‌రావు పిలుపునిచ్చారు. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం తోటపల్లిలో  150 మంది యువకులు వైయస్సార్‌ సీపీలో చేరగా, వారికి పార్టీ కండువాలు కప్పి ఆయన ఆహ్వానించారు. సంక్షేమ పథకాలను వైయస్‌ జగనన్న మాత్రమే అమలు చేయగలడన్నారు. మానకొండుర్‌ పార్టీ ఇన్చార్జ్‌ సోట్టు అజయ్‌వర్మ, మండలశాఖ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్, పార్టీ బీసీ సెల్‌ అధ్యక్షుడు అశోక్‌ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Back to Top