వైయస్ జగన్‌పై విమర్శలు మానుకోవాలి

వంగర: వైయస్‌ఆర్‌సీపీ అధినేత వైయస్‌ జగన్మోహన్‌రెడ్డిపై టీడీపీ నేతలు తప్పుడు ఆరోపణలు మానుకోవాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పాలవలస విక్రాంత్‌ అన్నారు. శనివారం మండల పరిధి కొట్టిశ గ్రామంలో ఇటీవల మృతిచెందిన ఉత్తరావెల్లి జనార్దన కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం మద్దివలసలో విలేకరులతో మాట్లాడారు. జగన్‌ బెయిల్‌ పిటీషన్‌ కొట్టివేయడం శుభపరిమాణం, ఆయనపై ఉన్న తప్పుడు కేసులు నుంచి కడిగిన ముత్యంగా బయటపడతారన్నారు. వైయస్‌ జగన్‌కు జనం నుంచి వస్తున్న ఆదరణను చూసి టీడీపీ నేతలు ఓర్వలేకపోతున్నారన్నారు. రైతులకు బాసటగా నిలిచేందుకు వచ్చే నెల 1, 2 తేదీల్లో నిర్వహించనున్న రైతు సదస్సును జయప్రదం చేయాలన్నారు. రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత ఉందని, వచ్చే ఎన్నికల్లో టీడీపీకి నూకలు చెల్లుతాయని అన్నారు. ప్రజా సంక్షేమ పథకాలకు చంద్రబాబు ప్రభుత్వం తూట్లు పొడుస్తుందని, గ్రామాల్లో ప్రభుత్వ ఫలాలు ప్రజలకు దరిచేరలేదన్నారు. ఈ కార్యక్రమంలో వైయస్‌ఆర్‌సీపీ జిల్లా కార్యదర్శులు ఉత్తరావెల్లి సురేష్‌ముఖర్జీ, కిమిడి ఉమామహేశ్వరరావు, టంకాల అచ్చెంనాయుడు, రేగిడి వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు వావిలపల్లి జగన్మోహనరావు, సర్పంచ్‌ఉదయాన మురళీకృష్ణ, సతివాడ కూర్మినాయుడు, ఉత్తరావెల్లి అప్పలనాయుడు, పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.

Back to Top