ప్రజలందరికీ సీఎం అని తెలుసుకో: ఎమ్మెల్యే ముస్తఫా

గుంటూరు: రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటే టీడీపీ నేతలకు ఒక్కరికే కాదు.. ప్రజలందరికీ ముఖ్యమంత్రి అని చంద్రబాబు నాయుడు తెలుసుకోవాలని ఎమ్మెల్యే ముస్తఫా చంద్రబాబుకు సూచించారు. రాష్ట్రంలో జన్మభూమి కమిటీలను ఏర్పాటు చేసి ప్రతిపక్ష ఎమ్మెల్యేల హక్కులను కాలరాస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ నాయకులను పెట్టుకొని కార్యక్రమం చేపడితే అది జన్మభూమి కార్యక్రమం ఎలా అవుతుందని నిలదీశారు. జన్మభూమి అంటే అర్థం తెలుసా అని చంద్రబాబును ప్రశ్నించారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేల నియోజకవర్గాల అభివృద్ధికి నిధులు ఇవ్వకుండా జన్మభూమి కమిటీల పేరుతో టీడీపీ నేతల జేబులు నింపుతున్నాడని మండిపడ్డారు. తన నియోజకవర్గంలో పించన్లు రాక, పక్కా గృహాలు లేక అనేకమంది నిరుపేదలు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికీ రెండున్నర సంవత్సరాలు దాటినా ప్రజల కష్టాలను పట్టించుకునే నాధుడే కరువయ్యాడని దుయ్యబట్టారు. పక్కా గృహాలకు చంద్రబాబు కొత్త నిబంధనలు పెట్టి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని చెప్పారు. ఫోన్, ఆటో, బైక్‌ ఉన్నవారికి ఇళ్లు అందకుండా కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.

Back to Top