వైఎస్సార్సీపీ నేతపై గొడ్డళ్లతో పచ్చరౌడీల దాడి

కర్నూలుః రాష్ట్రంలో తెలుగుతమ్ముళ్ల గుండాయిజం పెచ్చుమీరుతోంది. అధికారాన్ని అడ్డం పెట్టుకొని వైఎస్సార్సీపీ నేతలపై దాడులు, దౌర్జన్యాలకు దిగుతున్నారు.  జిల్లాలోని అవుకు మండలం శివవరం గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత జగదీష్ రెడ్డిపై పచ్చనేతలు గొడ్డళ్లతో దాడికి తెగబడ్డారు. దీంతో, జగదీష్ రెడ్డి  చేతికి తీవ్ర గాయమైంది. క్షతగాత్రుడిని అతని బంధువులు బనగానిపల్లెలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top