వైయస్ జగన్ దైవదర్శనంపై పచ్చరాజకీయం

  • వైయస్ జగన్ తిరుమల పర్యటనపై పచ్చఛానళ్ల అక్కసు
  • రాజకీయ లబ్ధి కోసం టీడీపీ పరమ నికృష్ణ ఆలోచన
  • స్వామివారిని కూడ పావుగా వాడుకోవడం దారుణం
  • టీడీపీకి దేవుడు తగిన శాస్తి చేస్తాడు
  • విజయవాడలో 40 గుళ్లు కూలగొట్టిన వ్యక్తి చంద్రబాబు
  • హిందూధర్మ రక్షణ కోసం వైయస్ఆర్ నడుంబిగించారు
  • వైయస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి

తిరుపతిః హిందూ ధార్మికత వెలుగొందాలని, ప్రజలకు మేలు జరగాలని  వేంకటేశ్వర స్వామి ఆశీర్వాదం కోసం వైయస్ జగన్ తిరుమలకు వస్తే ఆ దర్శనం మీద కూడ టీడీపీ రాజకీయ లబ్ధి పొందాలని చూస్తోందని, ఇలాంటి పరమ నికృష్ట ఆలోచన చేసిన చంద్రబాబు పార్టీకి దేవుడు తగిన శాస్తి చేస్తాడని వైయ్ససార్సీపీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. వైయస్ జగన్ దైవ దర్శనాన్ని తట్టుకోలేక కొన్ని ఏడుపుగొట్టు ఛానళ్లు అక్కసు వెళ్లగక్కుతున్నాని భూమన మండిపడ్డారు. చంద్రబాబుపై ఉన్న ప్రభుభక్తిని చాటుకునే ప్రయత్నం చేస్తూ పచ్చరోగులు వైయస్ జగన్ ను ప్రజల్లో పలుచన చేయాలని చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ను రాజకీయంగా ఇబ్బంది పెట్టేందుకు వేంకటేశ్వరుడిని కూడ పావుగా వాడుకునేందుకు బాబు పార్టీ ప్రయత్నించడం దారుణమన్నారు. కచ్చితంగా టీడీపీకి పాపం తగులుతుందని హెచ్చరించారు. తిరుపతిలో భూమన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రజలకు మేలు జరగాలన్న తలంపుతో  వైయస్ జగన్ తిరుమలలో శ్రీవారిని దర్శించుకొని ఆశీర్వాదం పొందారని చెప్పారు. 

దివంగత ముఖ్యమంత్రి డా. వైయస్ రాజశేఖరెడ్డి ఐదేళ్లపాటు సీఎంగా ఉన్న సమయంలో గరుడసేవ రోజున స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారని,  ఐదేళ్లలో 26సార్లు వేంకటేశ్వరస్వామిని దర్శనం చేసుకున్నారని భూమన తెలిపారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడ పాదయాత్ర పూర్తయ్యాక దేవుడికి మొక్కు చెల్లించడం కోసమని ఏడుకొండలు నడిచి స్వామివారిని దర్శనం చేసుకున్నారన్నారు.  భగవంతుని పట్ల తనకున్న అనన్యభక్తి విశ్వాసాలను వైయస్ఆర్ చాటుకున్నారని, ఏరోజు  కూడ డిక్లరేషన్ అన్నదానిలో సంతకం పెట్టకుండానే దర్శనం చేసుకున్నారని గుర్తు చేశారు. అందుకు ప్రత్యక్షసాక్షిని తానేనని చెప్పారు. కానీ పచ్చకామెర్ల పార్టీ, ఛానళ్లు వైయస్ఆర్ పై ఏడుకొండలను రెండు కొండలు చేశాడంటూ ప్రజల్లో చొప్పించేందుకు ఓ విష ప్రచారం చేశాయన్నారు.  వైయస్ఆర్ సీఎంగా ఉన్నప్పుడే ధర్మప్రచార పరిషత్ ను హిందూ ధర్మప్రచార పరిషత్ గా మార్చారన్నారు.  వెంకటేశ్వర భక్తి ఛానల్ ను స్థాపించింది కూడ వైయస్ఆర్ అన్న సంగతి  పచ్చకామెర్ల రోగులు గుర్తు చేసుకోవాలని భూమన చురక అంటించారు.  వేద విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పడంతో పాటు కొండమీదున్న కార్మికులను తన హయాంలో పర్మినెంట్ ఉద్యోగులుగా చేసిన ఘనత వైయస్ఆర్ దేనన్నారు.  వేదం చదివే ప్రతి విద్యార్థికి వైయస్ఆర్  2లక్షల స్టైఫండ్ ఏర్పాటు చేశాడని భూమన గుర్తు చేశారు.  దేవాలయాలకు దూపదీప నైవేద్యాలు నిరాటంకంగా జరగాలని ఆలోచన చేసిందే వైయస్ఆరేనని భూమన అన్నారు.  అర్చక సంఘాలకు  వైయస్ఆర్ ఎనలేని మేలు చేశారని,  హిందూ ధర్మాన్ని రక్షించేందుకు వైయస్ఆర్ నడుబిగించారని  ఆనాడు ధర్మకర్తలు చెప్పిన విషయాన్ని భూమన ఈ సందర్భంగా గుర్తు చేశారు. వైయస్ఆర్ ఏనాడు తన పదవిని అధికారం కోసం వాడుకోలేదని, చంద్రబాబు లాగ బూట్లు కూడ విప్పకుండా జలహారతిలిచ్చే  కార్యక్రమం చేయలేదన్నారు. అలాంటి మహానేత తనయుడి దైవదర్శనంపై పచ్చరోగులు ఎదురుదాడి చేయడం దారుణమన్నారు. 

విజయవాడలో 40 గుళ్లు కూలగొట్టిన చరిత్ర చంద్రబాబుదని భూమన మండిపడ్డారు.  అమరేశ్వరుని ఆలయ భూముల్ని అప్పనంగా ధారదత్తం చేసిన ఇలాంటి వ్యక్తి హిందువునంటే సభ్యసమాజం నవ్వుతుందన్నారు. బాబు పాలనలో మొత్తం కొండమీద అవినీతి జరుగుతుందని పత్రికలు కోడై కూస్తున్నాయన్నారు. బాబు ఎక్కడ హారతిచ్చినా, కొబ్బరికాయ కొట్టినా చెప్పులు కూడ విప్పడని...ఆయన్ను కాపు కాసేందుకు మాత్రం పచ్చఛానళ్లు ఆరాటపడతాయని భూమన విమర్శించారు.  జగన్ ను  రాజకీయంగా దెబ్బతీసేందుకు వేంకటేశ్వరుడిని కూడ పచ్చరోగులు పావుగా వాడుకోవడం దారుణమన్నారు.  వైయస్ జగన్ ను ఆలయానికి దూరం చేసే ప్రయత్నంలో భాగంగా పచ్చరోగులు ఎదురుదాడి చేస్తున్నారని భూమన ఆగ్రహం వ్యక్తం చేశారు. అత్యంత భక్తివిశ్వాసాలతో వైయస్ జగన్ తిరుమలకు వస్తే....  ఎవరో అమ్మాయి చెప్పులేసుకుపోయిందని,  దాన్ని చూపించి జగన్ తో పాటు ఆవిడ వెళ్లిందని పచ్చకామెర్ల మీడియా ప్రచారం చేయడం ఘోరమన్నారు.  

ఉభయ రాష్ట్రాల్లో 32వేల మందికి తిరుమలలో వైయస్ఆర్ వివాహాలు జరిపించారన్నారు. దళిత గోవిందం అనే బృహత్తర కార్యక్రమం చేపట్టి పీఠాధిపతుల మన్ననల్ని పొందారన్నారు. దేశంలో పీఠాధిపతులందర్నీ ఏకతాటిపైకి తెచ్చి వేంకటేశ్వరుడి వైభవాన్ని విశ్వవ్యాప్తం చేసేందుకు వైయస్ఆర్ కృషి చేశారన్నారు. వైయస్ జగన్ పై పాపం మోపే ప్రయత్నం చేస్తే హిందువులంతా పచ్చబాబుల ముఖాన ఉమ్మి వేస్తారన్నారు.  ఈ ప్రభుత్వం  భగంవుతిడి దగ్గరకు ఎవరూ రావొద్దన్న నీచమైన ఆలోచన చేస్తోందని భూమన ఫైర్ అయ్యారు. టీడీపీ కుట్రలకు భయపడబోమన్నారు. వైయస్ఆర్ కుటుంబానికి స్వామిపట్ల నమ్మకం, విశ్వాసం చెక్కుచెదరదని పచ్చరోగులకు గుర్తు చేస్తున్నామన్నారు. 
Back to Top