జగన్ పై విషం కక్కుతున్న ఎల్లో మీడియా

హైదరాబాద్, అక్టోబర్ 29: ముఖ్యమంత్రి చంద్రబాబుకు అనుకూలంగా ఉన్న ఎల్లో మీడియా, కొన్ని పత్రికలు కావాలనే తమ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై విషం చిమ్ముతున్నాయని, అందులో భాగంగానే 'వైఎస్సార్సీపీలో నుంచి వారు వెళ్ళిపోతున్నారు.. వీరు వెళ్ళిపోతున్నారు..' అని గత వారం రోజులుగా దురుద్దేశ పూరిత కథనాలు ప్రచారం చేస్తున్నాయని వైఎస్సార్సీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు అంబటి రాంబాబు విమర్శించారు.

ఆయన బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేనందుకు చంద్రబాబుపై వస్తున్న వ్యతిరేకత నుంచి ప్రజల దృష్టిని మళ్ళించేందుకే ఎల్లో మీడియా శ్రీ జగన్ గారిని, వైఎస్సార్సీపీని లక్ష్యంగా చేసుకుని విషప్రచారం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మేల్యే జలీల్ ఖాన్ వెళ్ళిపోతున్నారని ఒకరోజు, ఉప్పులేటి కల్పన వెళ్ళిపోతున్నారని మరోరోజు కథనాలు అల్లి కనీసం వాస్తవాలేమిటో నిర్ధారించుకోకుండా జగన్ గారికి వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నారని దుయ్యబట్టారు.

అద్భుతమైన రీతిలో అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు రైతుల రుణమాఫీ, ఇంటికొక ఉద్యోగం, ద్వాక్రా మహిళల రుణాల మాఫీతో సహా అనేక వగ్దానాలు నెరవేర్చలేక పోతున్నందువల్ల రైతులు, విద్యార్ధులు, మహిళల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతొందన్నారు. ఈ విషయాలను కప్పిపుచ్చుకునేందుకు ఓ వర్గం మీడియా జగన్పై చేస్తున్న దుష్ప్రచారాన్ని నమ్మవద్దని పార్టీ శ్రేణులకు విజ్ణప్తి చేశారు. హామీలు తీర్చలేక ప్రజలను నేరుగా ఎదుర్కోలేని పరిస్థితుల్లో వ్యతిరేకత ఎదుర్కుంటున్న టీడీపీ నేతలే వారి పార్టీలో మనుగడ ఉంటుందో ఉండదోననే కంగారుతో ఉన్నారని ఎద్దేవ చేశారు.

ప్రజలికిచ్చిన హామీలు నెరవేర్చలేక దౌర్భాగ్య స్థితిలో మునిగే నౌకలాగ టీడీపీ తయారైందన్నారు. బాధ్యత గల ప్రతిపక్ష నేతగా జగన్ ప్రజల కోసం పోరాడుతున్నారని, అలాంటి నేతపై ఓ వర్గం పత్రికలు, మీడియా వార్తలు రాసి లేనిపోని కూతలు కూసినంత మాత్రాన ఏమీ కాదనే విషయం కార్యకర్తలు గుర్తించాలని కోరారు. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక, కాకముందు కూడా ఇలాగే ఓ వర్గం మీడియా ఆయనపై అబద్ధపు వార్తలు రాశాయని, అయినా ప్రజలు వాటిని నమ్మలేదని చెప్పారు. పత్రికలు కూడా ఓ వార్త రాసేముందు నిర్ధారించుకుని వాస్తవాలకు దగ్గరగా ఉంటే ప్రచురించే విషయం పునరాలోచించాలని ఆయన విజ్ణప్తి చేశారు.

జగన్ ఆర్ధిక ఉగ్రవాది అంటూ టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు చేసిన వ్యాఖ్యలను అంబటి తీవ్రంగా ఖండించారు. గుంటూరు వద్ద కార్ రేసింగ్ లో ఒక విద్యార్ధి దుర్మరణానికి ఎమ్మెల్యే కుమారుడు కారణమని 'సాక్షి' దినపత్రికలో వార్త ఇతర పత్రికల్లో రాకుండా ఎమ్మెల్యే మేనేజ్ చేసుకోగలిగారని, సాక్షిలో రావడం ఆయన అక్కసుకు కారణమని అన్నారు.

తాజా వీడియోలు

Back to Top