ఎల్లో మీడియా దుష్ర్పచారం

హైదరాబాద్ః ప్రాణం పోయినా సరే తెలుగుదేశం పార్టీలో చేరనని నూజివీడు ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావు అన్నారు. తన కుమారుడు సీఎంను కలిశాడన్నది అవాస్తమన్నారు. దమ్ముంటే నిరూపించాలని సవాల్ విసిరారు. కావాలనే ఎల్లో మీడియా  పార్టీ మారుతున్నారంటూ దుష్ర్పచారం చేస్తోందని ప్రతాప్ అప్పారావు మండిపడ్డారు. ఎమ్మెల్యేగా తాను ఏ తప్పు చేయలేదన్నారు. తెలుగుదేశం పార్టీ బెదిరింపులకు భయపడేది లేదన్నారు.

Back to Top