కోర్టు వద్ద పచ్చనేతల న్యూసెన్స్.. లాయర్ల ఆగ్రహం

గన్నవరం: ఓ ఎమ్మెల్యేగా తన హక్కులకు పోలీసులు భంగం కలిగించారని డీజీపీ, తదితర పోలీసు అధికారులపై కృష్ణా జిల్లా గన్నవరం కోర్టులో వేసిన ప్రైవేటు కేసులో వైయస్సార్సీపీ ఎమ్మెల్యే ఆర్‌ కే రోజా విచారణకు హాజరయ్యారు. అయితే ఈ సందర్భంగా ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పార్టీ జెండాలతో తెలుగుదేశం కార్యకర్తలు కోర్టు సమీపంలోకి ర్యాలీగా వచ్చారు. 
 
టీడీపీ కార్యకర్తలు జెండాలతో కోర్టుకు రావడాన్ని న్యాయవాదులు ఖండించారు. న్యాయస్ధానాలను గౌరవించాల్సిన రాజకీయపార్టీ  విపక్ష పార్టీ ఎమ్మెల్యేకు నిరసన తెలుపుతూ పార్టీ జెండాలతో ర్యాలీగా కోర్టు వద్దకు రావడాన్ని ఆక్షేపించారు. తనకు రక్షణ కల్పించాలంటూ కోర్టుకు వచ్చిన ఎమ్మెల్యేకే రక్షణ లేకపోవడం దారుణమని వారు పేర్కొన్నారు. 
Back to Top