మైనారిటీలపై మానవత్వం చూపేది ఒక్క వైఎస్‌ఆర్‌ కుటుంబ‌మే



కర్నూలు: మైనారిటీలపై మానవత్వం చూపేది ఒక్క వైయ‌స్‌ఆర్‌ కుటుంబం మాత్రమేనని కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త హఫీజ్‌ఖాన్ అన్నారు. కర్నూలు పాతబస్తీలోని రాయల్‌ ఫంక్షన్‌ హాల్‌లో పార్టీ కర్నూలు నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం  నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ..మైనార్టీలంతా వైయ‌స్ఆర్‌సీపీ పక్షమేనన్నారు. వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ ఎల్లప్పుడూ ముస్లిం మైనార్టీలకు అండగా ఉంటుందని  పార్టీ జిల్లా రీజినల్‌ కో–ఆర్డినేటర్‌ మేకపాటి గౌతంరెడ్డి అన్నారు. కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త హఫీజ్‌ఖాన్‌కు పార్టీ నాయకులు, కార్యకర్తలు కలసికట్టుగా సహకరించాలని సూచించారు. చంద్రబాబు ప్రభుత్వం టార్గెట్లు విధించి..ప్రజలకు మద్యం తాపిస్తూ ప్రాణాలను హరిస్తోందన్నారు. టీడీపీ పాలనలో రాష్ట్ర అభివృద్ధి జరగలేదని.. అధికార పార్టీ నేతలు అక్రమమార్గంలో ఆర్థికంగా బలపడుతున్నారని విమర్శించారు. నమ్ముకున్న వారిని అమ్ముకుని పోయాడంటూ పార్టీ మారిన ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి గురించి ఎద్దేవా చేశారు. జన్మభూమిలో రేషన్‌ కార్డులు, పింఛన్లు, ఇళ్లు ఇవ్వకుండా మోసం చేస్తున్నారన్నారు. దీంతో విసిగిపోయిన ప్రజలు అధికారులను నిలదీస్తున్నారన్నారు. కర్నూలు మండల పరిధిలోని పూడూరులో అధికారులను ఊర్లోకి కూడా రానీయలేదన్నారు. సాధ్యంకాని హామీలు గుప్పించడం టీడీపీ అధినేత చంద్రబాబు నైజమన్నారు. మాట ఇస్తే మడమ తిప్పని నేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి అని, అన్ని వర్గాల ప్రజల మేలు కోసం నవరత్నాల వంటి పథకాలను రూపొందించారని తెలిపారు. డబ్బుతో రాజకీయం చేసే చంద్రబాబుకు ప్రజలు బుద్ధి చెబుతారన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయన ఎంత డబ్బు ఖర్చు పెట్టినా ప్రజలు వైయ‌స్‌ఆర్‌సీపీకే పట్టం కడతారని ధీమా వ్యక్తం చేశారు. నైతిక విలువలు కాపాడేందుకే  వైయ‌స్ఆర్‌సీపీ ఆవిర్భవించిందని, ప్రజల కోసమే వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి ఎండనకా, వాననకా పాదయాత్రలు నిర్వహిస్తున్నారని తెలిపారు. 
  
కర్నూలు అసెంబ్లీ స్థానానికి వైయ‌స్ఆర్‌సీ పీ అభ్యర్థిగా హఫీజ్‌ఖాన్‌
 కర్నూలు అసెంబ్లీ స్థానం నుంచి వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థిగా హఫీజ్‌ ఖాన్‌ను ప్రకటించారు. కర్నూలులోని రాయల్‌ ఫంక్షన్‌ హాలులో బుధవారం సాయం త్రం కర్నూలు నియోజకవర్గ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఎమ్మెల్యే, పార్టీ రీజినల్‌ కోఆర్డినేటర్‌ మేకపాటి గౌతంరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షుడు వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఆయన హఫీజ్‌ ఖాన్‌ను అభ్యర్థిగా ప్రకటించారు. 




Back to Top