యనమలను ఏ-1 ముద్దాయిగా చేర్చాలి

విశాఖ: పాల్మన్పేట ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిజ నిర్థారణ కమిటీ డిమాండ్ చేసింది.  కమిటీ శుక్రవారం పాల్మన్పేట గ్రామాన్ని సందర్శించి బాధితుల్ని పరామర్శించింది. ఈ సందర్భంగా నిజనిర్థారణ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఏ-1 ముద్దాయిగా మంత్రి యనమల రామకృష్ణుడిని చేర్చాలని డిమాండ్ చేశారు. 307 సెక్షన్ కింద నిందితులపై కేసు నమోదు చేయాలన్నారు. పాయకరావుపేట ఎస్ఐని  సస్పెండ్ చేయాలని, బాధితులకు తక్షణమే పునరావాసం ఏర్పాటు చేయాలన్నారు.

Back to Top