యనమలే అసలు దోషి


విశాఖ: విశాఖపట్నం..తూర్పుగోదావరి
జిల్లాల సరిహద్దుల్లోని పాల్మన్ పేట దాడికి మంత్రి యనమలే అసలు దోషి అన్న మాట
ముక్తకంఠంతో వినిపిస్తోంది. అక్కడ పర్యటించిన వైయస్సార్సీపీ నిజ నిర్ధారణ కమిటీ
సభ్యుల దగ్గర బాధితులు తమ గోడు వెల్లబోసుకొన్నారు.

జరిగింది ఏమిటంటే..

మంత్రి యనమల రామక్రిష్ణుడు నియోజకవర్గం
తునికి ఆనుకొని విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం ఉంది. అందులోని
మత్స్యకార గ్రామం పాల్మన్ పేట ఉంది. అందులోని మత్స్య కార కుటుంబాల మీద మొన్న
రాత్రి ఒక్కసారిగా మంత్రి యనమల రామక్రిష్ణుడు, ఆయన సోదరుడు క్రిష్ణుడు అనుచరుల్ని
పంపించి దాడి చేయించారు. రాత్రంతా ఊరిలోని జనం అంతా చేతుల్లో ప్రాణాలు పెట్టుకొని
కాలం గడిపారు. మహిళలు, పిల్లలు అన్న విచక్షణ లేకుండా తరిమి తరిమి కొట్టారు. దీని
మీద స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చినా, మంత్రిగారి వ్యవహారం అన్నట్లుగా
స్పందించనేలేదు

నిజ నిర్ధారణ కమిటీ పర్యటన

టీడీపీ నాయకుల అరాచకాల్ని వైయస్సార్సీపీ
ఖండించింది. దీని మీద నిజ నిర్ధారణ కమిటీ ఏర్పాటు చేసింది. కమిటీ
సభ్యులు మోపిదేవి వెంకటరమణ, బొత్స
సత్యనారాయణ, దాడిశెట్టి రాజా, చెంగల వెంకట్రావు, గొల్ల
బాబూరావు, కోలా గురువులు తదితరులు ఇవాళ పాల్మన్‑పేటలో పర్యటించారు. ఆ సమయంలో బాధితులంతా తమ గోడు వెళ్లబోసుకొన్నారు. దీని మీద నిజనిర్థారణ
కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఏ-1
ముద్దాయిగా మంత్రి యనమల రామకృష్ణుడిని చేర్చాలని డిమాండ్ చేశారు. 307 సెక్షన్ కింద నిందితులపై కేసు నమోదు చేయాలన్నారు. పాయకరావుపేట
ఎస్‑ఐని  సస్పెండ్ చేయాలని, బాధితులకు
తక్షణమే పునరావాసం ఏర్పాటు చేయాలన్నారు.

పోలీసుల ఓవరాక్షన్

కాగా, వైయస్సార్సీపీ సభ్యులు గ్రామంలో
పర్యటిస్తే నిజాలు బయటకు వస్తాయన్న భయం టీడీపీ నాయకులకు పట్టుకొంది. దీంతో
పోలీసుల్ని ఉసిగొల్పింది. గ్రామంలోకి అడుగు పెట్టవద్దంటూ పోలీసులు అడ్డుకొన్నారు. తుని
వద్దనే సభ్యుల్ని పోలీసులు అడ్డుకొనే ప్రయత్నం చేశారు. దీంతో వైయస్సార్సీపీ
సభ్యులు పోలీసుల దౌర్జన్యాన్ని నిలదీశారు. దీని మీద ప్రజాస్వామ్యయుతంగా
ప్రతిఘటించారు. 

తాజా వీడియోలు

Back to Top