వైయ‌స్ జ‌గ‌న్ సీఎం కావాల‌ని యాగంనెల్లూరు : వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటూ పార్టీ రాష్ట్ర కార్యదర్శి డా. ఆరిమండ వరప్రసాద్ రెడ్డి యాగం నిర్వహిస్తున్నారు. ఎన్నికల దాకా ఈ మహారుద్ర సహిత సహస్ర చండి యాగ మహోత్సవం కొనసాగుతుంది. 
ఈ మహోత్సవంలో భాగంగా 28-01-2018 తేదీన ద్విశత రుద్రహోమం, త్రిశత చండీహోమం నిర్వహించారు. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం ప్రజాసంకల్పయాత్ర ప్రారంభించిన వైయ‌స్ జగన్‌ను వరప్రసాద్‌రెడ్డి కలిసి ప్రసాదం అందజేశారు. వేదపండితుల మంత్రోచ్ఛారణ నడుమ ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. కాగా, ఇవాళ వైయ‌స్ జ‌గ‌న్ పాద‌యాత్ర వెయ్యి కిలోమీట‌ర్ల మైలు రాయిని పూర్తి చేసుకుంటోంది. ఈ సంద‌ర్భంగా తెలుగు రాష్ట్రాల్లో వాక్ విత్ జ‌గ‌న‌న్న కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హిస్తున్నారు.Back to Top