సమైక్య రాష్ట్రంలోనే జగన్ సిఎం అవుతారు

హైదరాబాద్, 13 సెప్టెంబర్ 2013:

వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు సమైక్య రాష్ట్రంలోనే జరుగుతాయని తాము భావిస్తున్నామని వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ ‌కేంద్ర పాలక మండలి సభ్యుడు, నెల్లూరు ఎంపి మేకపాటి రాజమోహన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. పార్టీ కేంద్ర కార్యాలయం ఆవరణలో ఆయన శుక్రవారంనాడు మీడియాతో కాసేపు మాట్లాడుతూ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. సమైక్య రాష్ట్రంలోనే శ్రీ వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అవుతారన్నారు. ఎన్నికల అనంతరం దేశ రాజకీయాల్లో శ్రీ జగన్మోహన్‌రెడ్డి కీలకపాత్ర పోషిస్తారని మేకపాటి జోస్యం చెప్పారు. శ్రీ జగన్మోహన్‌రెడ్డి త్వరలోనే జైలు నుంచి బెయిల్పై విడుదల అవుతార‌న్న ధీమా వ్యక్తంచేశారు. తమ పార్టీకి భారత న్యాయ వ్యవస్థపై సంపూర్ణ విశ్వాసం ఉందని అన్నారు. తమ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డి ప్రజల్లోకి రాకూడదని టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు కోరుకుంటున్నారని రాజమోహన్‌రెడ్డి అన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top