కృష్ణా జిల్లాలో వైయస్ జగన్ పర్యటన

కృష్ణాః వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైయస్ జగన్‌మోహన్‌ రెడ్డి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు.  ఉదయం విమానాశ్రయంలో ఆయనకుపార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. మచిలీపట్నం (బందరు) పోర్టు కోసం టీడీపీ ప్రభుత్వం ఏకపక్షంగా రైతుల పొలాలను లాక్కుంటున్న ప్రాంతాలను వైయస్ జగన్ సందర్శిస్తారు. బందరు మండలంలోని బుద్దాలవారి పాలెం, కోన గ్రామాలలో ఆయన పర్యటిస్తారు. గన్నవరం విమానాశ్రయం నుంచి వైయస్‌ జగన్‌ రోడ్డుమార్గంలో మచిలీపట్నం బైపాస్ మీదుగా బుద్దాలవారి పాలెం చేరుకుంటారు. అక్కడ రైతులతో మాట్లాడుతారు. అనంతరం  అక్కడి నుంచి కోన గ్రామానికి చేరుకుని బాధిత రైతులతో ముఖాముఖి నిర్వహించి.. వారిని ఉద్దేశించి ప్రసంగిస్తారు.
Back to Top