క్రిష్ణపట్నం పనుల్లో అవకతవకలు: కాకాని

హైదరాబాద్) అసెంబ్లీ సమావేశాల ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో వైఎస్సార్సీపీ సభ్యుడు కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడారు. క్రిష్ణపట్నం పనుల విషయంలో మంత్రి ఇచ్చిన సమాధానం లోపభూయిష్టంగా ఉందని సభ నోటీసుకి తెచ్చారు. అన్ని పనులు పారదర్శకంగా ఉంటాయని చెబుతున్నారని, కానీ వాస్తవంగా చూస్తే అవకతవకలు స్పష్టంగా కనిపిస్తున్నాయని వ్యాఖ్యానించారు. ఇందుకు సంబంధించిన ఆధారాల్ని ఆయన చూపించారు. నామినేషన్ విధానంలో స్థానికంగా పనులు కేటాయించేస్తున్నారని పేర్కొన్నారు. దీని మీద మంత్రి అచ్చెన్నాయుడు సమాధానం ఇచ్చారు. 
Back to Top