బీఏసీ భేటీ మీద బూటకాలు

హైదరాబాద్) అసెంబ్లీ వేదికగా చంద్రబాబు ప్రభుత్వం ఆడుతున్న నాటకాలు సోమవారం నాటి సభలో తేట తెల్లం అయ్యాయి. అసెంబ్లీసమావేశాల మొదటి రోజున జరిగిన బీఏసీ సమావేశంలో అంబేద్కర్ మీద చర్చ అంశం ప్రస్తావనకు రానే రాలేదు. తర్వాత రోజు సమావేశం జరుగుతుండగా మొదటి వాయిదా తరవాత అకస్మాత్తుగా వెలుగు చూసింది. అయినా సరే, బీఏసీ సమావేశంలో నిర్ణయించాం అంటూ ప్రభుత్వం అబద్దాలు పలికింది. అంతే గాకుండా దీనికి ప్రతిపక్ష సభ్యులు ఆమోదం తెలిపారుఅంటూ మంత్రులు పదే పదే దొంగ ప్రచారాలు చేశారు. అప్పటి నుంచి అది అబద్దం అని వైఎస్సార్సీపీ విప్ శ్రీకాంత్ రెడ్డి, వైఎస్సార్సీఎల్పీ ఉప నేత జ్యోతుల నెహ్రూ చెబుతూనే ఉన్నారు. సోమవారం అదే విషయాన్ని స్పీకర్ ప్రస్తావించినప్పుడు వెంటనే మైక్ తీసుకొన్న శ్రీకాంత్ రెడ్డి, ప్రభుత్వం అబద్దాలు ఆడుతోందని సభ ద్రష్టికి తెచ్చారు. వెంటనే ఆయన మైక్ ను కట్ చేయించారు. పూర్తిగా మాట్లాడకుండానే మైక్ కట్ చేయించి లాగేసుకొన్నారు. అంటే సభలో ఆయన వాస్తవాలు చెబితే దొంగ నాటకాలు బయట పడతాయనే ప్రభుత్వం ఈ దొంగ పని చేసిందని అర్థం అవుతోంది. 
Back to Top