అక్ర‌మ త‌వ్వ‌కాల‌ను స‌హించేది లేదు


నెల్లూరు: గ‌్రావెల్ అక్ర‌మ తవ్వ‌కాల‌ను స‌హించేది లేద‌ని  వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్య‌క్షుడు కాకాని గోవ‌ర్థ‌న్ రెడ్డి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. బుధ‌వారం ఆయ‌న స్థానిక విలేక‌రుల స‌మావేశంలో మాట్లాడుతూ... బాబు అధికారంలోకి వ‌చ్చి రెండున్న‌రేళ్లు గ‌డుస్తున్నా,,  ప్ర‌జ‌ల‌కు మాత్రం చేసంది శూన్య‌మేన‌ని ఆయ‌న ధ్వ‌జ‌మెత్తారు. ఎన్నిక‌లకు ముందు అమ‌లకు సాధ్యం కాని హామీలిచ్చి తీరా అధికారంలోకి వ‌చ్చాక ప్ర‌జ‌ల‌ను న‌ట్టేట ముంచిన ఘ‌నత చంద్రబాబుద‌న్నారు. స‌ర్వేప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలో గ్రావెల్ అక్ర‌మ త‌వ్వ‌కాల‌పై త‌క్ష‌ణమే విచార‌ణ జ‌రిపించాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. త‌మ పార్టీ నేత‌ల‌కు చెందిన వాహ‌నాల‌పై త‌ప్పుడు కేసులు న‌మోదు చేయ‌డం స‌రైంది కాద‌న్నారు. టీడీపీ అవినీతిని నిరూపించేందుకు వైయ‌స్సార్‌సీపీ సిద్ధంగా ఉంద‌ని, ద‌మ్ముంటే బ‌హిరంగ చ‌ర్చ‌కు రావాల‌ని ఆయ‌న స‌వాల్ విసిరారు.

తాజా ఫోటోలు

Back to Top