ఫిరాయింపు దారుల్ని అడ్డదారిలో కాపాడిన ప్రభుత్వం


హైదరాబాద్)
ప్రజాస్వామ్య చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా తెలుగుదేశం ప్రభుత్వం అరాచకాల్ని వండి
వార్చింది. అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్
మాట్లాడుతుండగా...స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు ఎప్పటిలాగే అడ్డుకొన్నారు. వెంటనే
అవిశ్వాస తీర్మానం మీద ఓటింగ్ చేపడుతున్నట్లుగా ప్రకటించారు. వెంటనే మూజువాణీ
ఓటింగ్ జరిపి సభ్యుల అభిప్రాయం అడిగారు. దీని మీద అభిప్రాయం చెబుతుండగానే ఓటింగ్
ముగిసిందని, తీర్మానం వీగిపోయిందని ప్రకటించేసి. బడ్జెట్ మీద చర్చను స్పీకర్
చేపట్టారు. దీని మీద డివిజన్ ఓటింగ్ కావాలని వైఎస్సార్సీపీ ఎంత విజ్నప్తి చేసినా
స్పీకర్ అంగీకరించలేదు.

వాస్తవానికి
ఫిరాయింపుదారుల్ని పట్టించేందుకు  అవిశ్వాస
తీర్మానాన్ని చేపట్టినట్లు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చెప్పారు. అయినా సరే
ఫిరాయింపు దారుల్ని కాపాడేందుకు ప్రభుత్వం పన్నిన కుట్ర విజయవంతంగా అమలు అయింది.
కనీసం  ఓటింగ్ కూడా జరపకుండా సభలో
తీర్మానాన్ని ముగించేశారు. 

Back to Top