బ్రిటీష్,తుగ్లక్ లను మించిన అరాచక పాలన

()సొంత జిల్లానే కాపాడలేని సీఎం రాష్ట్రాన్నేమి ఉద్దరిస్తాడు
()అవినీతిపరంగా వచ్చే డబ్బులే బాబుకు ముఖ్యం
()అందుకే హోదా కాదని ప్యాకేజీని కోరుతున్నాడు
()వైయస్సార్సీపీ నేతలు మిథున్ రెడ్డి, మదుసూదన్ రెడ్డి

తిరుపతి:  వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి ముఖ్య‌మంత్రి అయితేనే దివంగ‌త మ‌హానేత వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి క‌ల నెర‌వేరిన‌ట్లు అవుతుందని వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి పేర్కొన్నారు. క‌ర్నాట‌క‌లో పాల‌పై స‌బ్సిడీ ఇస్తున్న విధంగా వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో సైతం పాల‌పై ఆధార‌పడ్డ ప్ర‌తి రైతుకు స‌బ్సిడీ ఇచ్చే విధంగా 2019 ఎన్నిక‌ల మ్యానిఫెస్టోలో చేర్చుతామ‌ని మిథున్‌రెడ్డి హామీనిచ్చారు. ప్ర‌భుత్వ డైరీని ఆదుకోవ‌డ‌మే కాకుండా... వాటిపైన ఆధార‌ప‌డ్డ రైతుల‌ను ఆదుకునే విధంగా వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి త‌గు చ‌ర్య‌లు తీసుకుంటున్నార‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. 

సొంత‌జిల్లాను కాపాడలేని సీఎం...!
దివంగ‌త మ‌హానేత డాక్ట‌ర్ వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి మ‌న్న‌వ‌రం బెల్ ప్రాజెక్టును ఏర్పాటు చేసినందువ‌ల్లే... ఆ ప్రాజెక్టు తరలిపోతున్నా చంద్ర‌బాబు నిమ్మ‌కునీరెత్తిన‌ట్లు వ్య‌వ‌హారిస్తున్నార‌ని వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రీ‌కాళ‌హ‌స్తి నియోజ‌క‌వ‌ర్గ ఇంచార్జ్ మ‌ధుసూధ‌న్ రెడ్డి అన్నారు. మ‌న్న‌వ‌రం ప్రాజెక్టు వ‌ల్ల ప‌దివేల మందికి ఉపాధి దొరుకుతుంద‌న్న విష‌యం కూడా చంద్ర‌బాబుకు కాన‌రావ‌డం లేద‌న్నారు. త‌న సొంత జిల్లా ప్రాజెక్టును కాపాడుకోలేని సీఎం ఇక రాష్ట్రాన్ని ఎలా కాపాడ‌గ‌ల‌ర‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. ప్ర‌త్యేక హోదా కోసం అంద‌రం క‌లిసి పోరాటం చేస్తే ప్ర‌త్యేక హోదా తప్ప‌కుండా వ‌స్తుంద‌న్నారు. హోదాకు బాబు అడ్డుప‌డితే వైయ‌స్ జ‌గ‌న్‌ సీఎం అయ్యాక తీసుకొస్తార‌ని ఆయ‌న ధీమా వ్య‌క్తం చేశారు. రాష్ట్రానికి అండ‌గా ఉండే ప్రాజెక్టుల క‌న్నా... అవినీతిప‌రంగా వ‌చ్చే డ‌బ్బులే బాబుకు ముఖ్య‌మ‌ని ఆరోపించారు. అందుకోస‌మే ప్ర‌త్యేక హోదా క‌న్న‌ా, ప్ర‌త్యేక ప్యాకేజీ కావాలంటున్నార‌ని ఆయ‌న విమ‌ర్శించారు. అధికార పార్టీ పాల్ప‌డుతున్న ప్ర‌జావ్య‌తిరేక విధానాల‌పై ఆందోళ‌న‌లు చేస్తే నాన్‌బెయిల‌బుల్ కేసులు పెట్ట‌డం దారుణ‌మ‌ని మండిప‌డ్డారు. బ్రిటీష్‌, తుగ్ల‌క్‌ల పాల‌న‌ క‌న్నా అరాచ‌కంగా చంద్ర‌బాబు పాల‌న కొన‌సాగుతోందని ధ్వ‌జమెత్తారు. 

తాజా ఫోటోలు

Back to Top