అవినీతి ముఖ్యమంత్రి బరితెగింపు రాజకీయాలు

న్యూఢిల్లీః చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మండిపడ్డారు.  అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే  బాబు లక్ష 36వేల  కోట్ల పై చీలుకు అవినీతికి పాల్పడ్డారని ఎండగట్టారు. అలా అక్రమంగా సంపాదించిన అవినీతి సొమ్ముతో ఎమ్మెల్యేలకు డబ్బులు, పదవులు ఎరచూపుతూ  కొనుగోలు చేస్తున్నారని దుయ్యబట్టారు. బాబు అనైతిక కార్యకలాపాలను జాతీయస్థాయిలో ఎలుగెత్తుతూ...ఆయన అవినీతిపై రూపొందించిన చంద్రబాబు ఎంపరర్ ఆఫ్ కరప్షన్ పుస్తకాన్ని వివిధ జాతీయ పార్టీ నేతలకు అందిస్తుననట్లు పేర్కొన్నారు. ఓ పార్టీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలు మరో పార్టీలోకి వెళ్లడం అనైతికం, చట్టవ్యతిరేకమన్నారు. 

ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించాల్సిన ముఖ్యమంత్రే బరితెగింపు రాజకీయాలు చేయడం దుర్మార్గమని అంబటి విమర్శించారు.  చంద్రబాబు, ఆయన బృందం చేస్తున్న అవినీతి, కుట్రలను చేధించేందుకే వైఎస్ జగన్ నాయకత్వంలో పార్టీ నేతలంతా ఢిల్లీ రావడం జరిగిందని అంబటి చెప్పారు. పార్టీ ఫిరాయింపులపై ఢిల్లీ వేదికగా  చర్చ జరగాల్సిన అవసరం ఎంతైనా ఉందని అంబటి అభిప్రాయపడ్డారు.  ఫిరాయింపు దారులను అనర్హులుగా ప్రకటించాల్సిన  స్పీకర్ అలసత్వం వహిస్తూ పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.  పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని కఠినం తరం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఫిరాయింపుదారులపై నిర్ధిష్ట సమయంలో చర్యలు తీసుకునేలా చట్టాన్ని సవరించి, దీనికి శాశ్వత పరిష్కారం కనుగొనాలన్నారు. 
Back to Top