స్వైన్ ఫ్లూతో ఆందోళన

న్యూఢిల్లీ: దేశంలో స్వైన్‌ఫ్లూ వ్యాధి విస్తరిస్తుండటంపై వైయస్సార్ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్యసభలో జీరోఅవర్‌లో ఆయన మాట్లాడారు. ఏపీలో 2016 సంవత్సరంలో 12 మందికి స్వైన్‌ఫ్లూ వైరస్‌ సోకగా ఐదుగురు చనిపోయారని తెలిపారు.

అదేవిధంగా ఈ ఏడాది జనవరిలో 26 మంది స్వైన్‌ఫ్లూ బాధితులకు గాను ఆరుగురు ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. స్వైన్‌ఫ్లూ వ్యాప్తిని అరికట్టటంలో యంత్రాంగం విఫలమయిందని ఆరోపించారు. వ్యాధి తీవ్రతను గుర్తించలేకపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కృషి చేయాలని ఆరోగ్య కుటుంబసంక్షేమ శాఖ మంత్రిని ఎంపీ విజయసాయిరెడ్డి కోరారు.
Back to Top