బాబు అవినీతిని చూసి ప్రపంచమంతా సిగ్గుపడుతోంది

హైదరాబాద్ః చంద్రబాబు అవినీతిని చూసి ప్రపంచమంతా సిగ్గుపడుతోందని వైయస్సార్సీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ఏపీలో జరుగుతున్న పరిణామాలు చూసి ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారు కలత చెందుతున్నారని చెప్పారు. తాను అమెరికా వెళ్లిన సందర్భంగా కూడా ప్రతి ఒక్కరూ ఒకే మాట చెప్పారని....రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారన్నారు. 


హైదరాబాద్ లో పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ...రాజ్యాంగానికి వ్యతిరేకంగా చంద్రబాబు ఇతర పార్టీ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి కొనడాన్ని చూసి  ప్రజలు అసహ్యించుకున్నారని తెలిపారు.  ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ రాష్ట్రాన్ని అవినీతి మయం చేసిన చంద్రబాబు పాలనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. 

To read this article in English: http://bit.ly/1YI8ngk 

Back to Top