వక్ఫ్‌బోర్డు మాజీ చైర్మన్‌ వైయస్‌ఆర్‌సీపీలో చేరిక

నంద్యాల: ఉప ఎన్నిక నేపథ్యంలో వైయస్‌ఆర్‌సీపీ బలం పుంజుకుంటోంది. నిన్న ఎస్‌డీపీఐ మాజీ అధ్యక్షుడు హబీబుల్లా వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సమక్షంలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరగా, ఇవాళ వక్ఫ్‌బోర్డు మాజీ చైర్మన్‌ ఇస్మాయిల్‌ పార్టీలో చేరారు. నంద్యాల ఉప ఎన్నికల్లో వైయస్‌ఆర్‌సీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. ఇస్మా యిల్‌ వెంట పెద్ద ఎత్తున మైనారిటీ నాయకులు పార్టీలో చేరారు. నంద్యాలలో వైయస్‌ఆర్‌సీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌ రెడ్డి విజయం ఖాయమని, మైనారిటీలంతా వైయస్‌ జగన్‌ వెంటే ఉన్నారని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి, శిల్పా చక్రపాణిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Back to Top