రాజన్న రాజ్యం కోసం కృషి

రాయదుర్గం అర్బన్‌: దివంగత మహానేత డాక్టర్‌ వై/స్‌ రాజశేఖర్‌రెడ్డి ఆశయాల సాధన కోసం.. అడ్డువస్తున్న సైతాన్‌లను ఓడించి, 2019 ఎన్నికల్లో రాజన్న రాజ్యం స్థాపన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాల్సిన అవసరం ఉందని వైయస్సార్‌సీపీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి పిలుపునిచ్చారు. శనివారం దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖర్‌రెడ్డి 8వ వర్ధంతి సందర్భంగా స్థానిక పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అదే విధంగా పట్టణంలోని శాంతినగర్‌లోను, ఆర్‌అండ్‌బీ అతిథి గృహం వద్ద, వైయస్సార్‌ సర్కిల్‌లోను మహానేత వైయస్సార్‌ విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రభుత్వాసుపత్రిలో రోగులకు వైద్యాధికారి డాక్టర్‌ సత్యనారాయణ సమక్షంలో పండ్లు, బ్రెడ్డు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా స్థానిక కార్యాలయం వద్ద కార్యకర్తలు, నాయకులనుద్దేశించి మాజీ ఎమ్మెల్యే కాపు మాట్లాడారు. మహానేత వైయస్‌రాజశేఖర్‌రెడ్డి మన మధ్య భౌతికంగా లేకపోయినప్పటికీ, ఆయన ప్రతి పేద వాని గుండెల్లో ఉన్నారని పేర్కొన్నారు. బిడ్డ అవసరాలను తల్లి ఏ విధంగా అయితే గుర్తిస్తుందో.. అదే విధంగా అన్ని వర్గాల ప్రజల అవసరాలను మహానేత వైయస్‌ రాజశేఖర్‌రెడ్డి గుర్తించారని పేర్కొన్నారు. అనేక సంక్షేమ పథకాలు చేపట్టి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు, ఆరోగ్య శ్రీ, ఫీజురీఎంబర్స్‌మెంట్, ఉచిత విద్యుత్, రైతులకు భరోసా కల్పించార న్నారు. నేడు అనేక మంది సైతాన్‌లు వైయస్సార్‌ ఆశయసాధనకు అడ్డువస్తున్నారని, వారిని ఓడించడానికి వైయస్‌ జగన్‌ అన్న వెంట ఉండి 2019 ఎన్నికల్లో వైయస్సార్‌సీపీని అధికారంలోకి తీసుకురావడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు.

తాజా ఫోటోలు

Back to Top