పుష్క‌రాల్లో కార్మికుల క‌ష్టాలు

- రోజుకూలీ కార్మికుల అవస్థలు
- ముందో ఓ మాట త‌ర్వాతో మాట‌


చంద్ర‌బాబు హోమీలు కార్మ‌ికుల‌ను మ‌రోసారి మోసం చేశాయి. పుష్క‌ర ప‌నుల‌కు తీసుకున్న కూలీల‌కు ముందు మంచిగా హామీలిచ్చి తీరా పుష్క‌రాలు ప్రారంభ‌మ‌య్యాక వారిని తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారు. రోజుకు మూడు వందలు, ఇంటినుండి తామే బండిలో తీసుకువ‌స్తామ‌ని, తిరిగి దింపుతామ‌ని..టిఫీన్, టీ , భోజనం , 8గంటల పని అన్ని ఉంటాయని పుష్కరాల ప్రారంభానికి ముందు టీడీపీకి చెందిన కాంట్రాక్టర్లు న‌మ్మ‌బ‌లికార‌ని... తీరా ఇప్పుడు ఉదయం 5గంటల నుండి పనిలో ఉన్నా కనీసం తాగునీరు అందించే నాధుడు లేకుండా పోయాడ‌ని కార్మ‌ికులు అంటున్నారు.

 "టిఫీన్ లేదు, టీ లేదు. అన్నీ మీరే తెచ్చుకోవాలి. పని మానేస్తే వెయ్యిరూపాయలు మీరె కట్టాలి, లేదా ఈరోజు కూలీ నిన్న కూలి రెండు ఇవ్వము"..అంటూ కాంట్రాక్ట‌ర్లు బెదిరిస్తున్నార‌ని కార్మ‌ికులు వాపోతున్నారు. పని చేయకుంటే చివాట్లు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.  తాము గొప్ప‌గా సౌక‌ర్యాలు క‌ల్పించ‌మ‌ని అడ‌గ‌డం లేద‌ని క‌నీస సౌక‌ర్యాలు క‌ల్పించాల‌ని ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు.  పుష్కరాలకు వచ్చే భక్తులు క్షేమంగా ఉండాలంటే కాంట్రాక్టు కార్మికుల పని చాలా కీలకం . దానిని మ‌ర‌చిపోయి కాంట్రాక్ట‌ర్లు  బెదిరింపులు జ‌రిపితే పుష్క‌రాల ప్రాంగ‌నంలోనే స‌మ్మె చేస్తామ‌ని వారు హెచ్చ‌రిస్తున్నారు. 
Back to Top