వైయస్‌ఆర్‌ సీపీ గెలుపుకు కృషి చేయాలి

గుంటూరు

: ఎన్నికల్లో బూత్‌ కమిటీలదే ప్రధాన పాత్ర అని, వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గెలుపుకు నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని గుంటూరు జిల్లా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జి బొత్స సత్యనారాయణ సూచించారు. గుంటూరు జిల్లా వినుకొండలో వైయస్‌ఆర్‌ సీపీ పార్లమెంట్‌ నియోజకవర్గ బూత్‌ కమిటీ శిక్షణా తరగతులను చేపట్టారు. ఈ సందర్భంగా పార్టీ సీనియర్‌ నేత, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఉమ్మారెడ్డి, వెంకటేశ్వర్లు, బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు,  అంబటి రాంబాబులు నాయకులు, కార్యకర్తలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో నేతలు బాలశౌరి, కావటి మనోహర్‌నాయుడు, బొల్లా బ్రహ్మనాయుడు తదితరులు పాల్గొన్నారు. 

Back to Top