పార్టీ బ‌లోపేతానికి కృషి చేయండి

మడకశిర రూరల్ (అనంత‌పురం) : మ‌డ‌క‌శిర మండలం ఆమిదాలగొంది పంచాయతీలోని గ్రామాల్లో ఇంటింటా ప్రభుత్వ వ్యతిరేక విధానాలను తెలియజేస్తూ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీని బ‌లోపేతం చేయాల‌ని గ్రామ పంచాయ‌తీ క‌మిటీ అధ్య‌క్షులు స‌త్య‌నారాయ‌ణ అన్నారు. ఆమిదాలగొంది పంచాయతీ ప‌రిధిలో ఇంటింటికీ వెళ్లి  ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.  కార్యక్రమంలో పట్టణ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ  కన్వీనర్ రామకృష్ణ, నాయకులు రామిరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, ఈశ్వరప్ప, పుట్టీరప్ప, కృష్టప్ప, మూర్తి, మంజు, శాంతకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Back to Top