రాజన్న సువర్ణ పాలన జగనన్నతోనే సాధ్యం

ఎన్నికల కోసం కోటి ఆశలతో ఎదురుచూస్తున్నాం
విశాఖపట్నం మహిళలు
విశాఖ: దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి సువర్ణ పరిపాలన ఆయన తనయుడు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ వల్లే సాధ్యమని విశాఖ జిల్లా మహిళలు అన్నారు. ప్రజా సంకల్పయాత్రగా పది జిల్లాల్లో పాదయాత్ర పూర్తి చేసుకొని 11వ జిల్లా విశాఖపట్నంలోకి అడుగుపెట్టిన జననేత వైయస్‌ జగన్‌కు విశాఖ మహిళలు ఘనస్వాగతం పలికారు. హారతులు పట్టి జననేతను దీవించారు. ఈ సందర్భంగా విశాఖ జిల్లా మహిళలు మాట్లాడుతూ.. వైయస్‌ జగన్‌తో మాత్రమే వైయస్‌ఆర్‌ ఆశయాలు సాధ్యమవుతాయన్నారు. వైయస్‌ జగన్‌ను ముఖ్యమంత్రిని చేసుకునేందుకు కోటి ఆశలతో ప్రజలంతా ఎన్నికల కోసం ఎదురుచూస్తున్నారన్నారు. 

విశాఖ ప్రజలను రెండు ప్రధాన సమస్యలు తీవ్రంగా వేధిస్తున్నాయని మహిళలు అన్నారు. విభజన చట్టంలోని ప్రత్యేక రైల్వేజోన్, భూ కుంభకోణం. ప్రత్యేక రైల్వేజోన్‌ సాధించడంలో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. భూకుంభకోణంలో నిస్పక్షపాతమైన విచారణ జరిగితే టీడీపీ మంత్రులు, బడా నేతలు వెలుగులోకి వస్తారని సాక్షాత్తు చంద్రబాబు కేబినెట్‌లోని మంత్రి అయ్యన్నపాత్రుడు చెప్పడం జరిగిందన్నారు. మా అందరి తరుపున ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి వైయస్‌ జగన్‌ ముందుకొచ్చారన్నారు. అదే విధంగా విశాఖను కాలుష్య సమస్య తీవ్రంగా వేధిస్తుందని, సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తాడని ఆశతో ఎదురుచూస్తున్నామన్నారు. 
Back to Top