వైయస్‌ జగన్‌పైనే ఆశలు పెట్టుకున్నాం

వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి వస్తే బతుకులు బాగుపడతాయి
విశాఖపట్నం: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తేనే ప్రజా జీవితం బాగుపడుతుందని, వైయస్‌ జగన్‌పై ఆశలు పెట్టుకున్నామని విశాఖ మహిళలు అన్నారు. విమ్స్‌ ఆస్పత్రి కోసం దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి చాలా కష్టపడ్డారని మహిళలు గుర్తు చేశారు. అలాంటి ఆస్పత్రిని చంద్రబాబు ప్రైవేటీకరణ చేయాలని చూస్తున్నాడన్నారు. సింహాచలం స్థలాలు ఆక్రమించుకుంటున్నారని, ఆ విషయాన్ని కూడా ప్రజలు వైయస్‌ జగన్‌ దృష్టికి తీసుకువచ్చారన్నారు. వైయస్‌ జగన్‌ సీఎం అయితేనే మంచి రోజులు వస్తాయని, ఆయన ప్రకటించిన పథకాలు ప్రతీ ఒక్కరికి ఉపయోగపడతాయన్నారు. పిల్లల భవిష్యత్తు బాగుపడుతుందన్నారు. ఆటోవాలాలకు సంవత్సరానికి రూ. 10 వేలు, చిన్న పిల్లలను బడులకు పంపిస్తే రూ. 15 వేలు ఇస్తామన్నారు. వైయస్‌ జగన్‌ సీఎం అయిన వెంటనే ఇవన్నీ పథకాలు అమలు చేస్తారని నమ్ముతున్నానన్నారు. 
Back to Top