బాబుకు కూతురు ఉంటే ఆ బాధేంటో తెలిసేది



అన్నా..ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు కూతురు లేక‌పోవ‌డంతో  ఆడ‌వాళ్ల విలువ తెలియ‌డం లేదు. టీడీపీ ప్రభుత్వంలో మహిళలకు ఏ విధమైన న్యాయం జరగలేదు. ఒకటి కాదు.. రెండు కాదు.. మచ్చుకు చదువుల తల్లి రిషితేశ్వరి. ర్యాంగింగ్‌ బూతానికి బలైపోయింది. ఆ కేసులో ఇప్పటి వరకు పురోగతి లేదు.  ఎమ్మార్వో వనజాక్షి, జెర్రిపోతులపాలెంలో మహిళలను వివస్త్రను చేశారు. చంద్రబాబుకు కూతురు లేక ఆ బాధ తెలియడం లేదు. దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో ఓ యువతిపై యాసిడ్‌ పోసిన వ్యక్తిని ఎన్‌కౌంటర్‌ చేయించారని గుర్తు చేశారు. అలాంటిది ఒకటి జరిగితేనే వీళ్లకు బుద్ధి వస్తుందన్నారు. 
––––––––––––––––––––––
మా పిల్ల‌ల‌ను చ‌దివించండన్నా..:అమజాన్‌
దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి ఉన్నప్పుడు మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్, ఫీజురియంబర్స్‌మెంట్‌ పథకం ప్రవేశపెట్టారు. ఫీజురియంబర్స్‌మెంట్‌ పథకం వచ్చినప్పుడు మేం బాగా చదువుకున్నాం. ఇప్పుడు మా పిల్లలను చదివించడానికి వెనకడుగు వేస్తున్నాం. చంద్రబాబు వచ్చి మా పిల్లల భవిష్యత్తును వెనక్కునెట్టేస్తున్నాడు. ఫీజు రియంబర్స్‌మెంట్‌ పథకం మళ్లీ తీసుకువచ్చి మా పిల్లలను చదివించండి అన్నా.. 
వైయస్‌ జగన్‌: నవరత్నాలలో ప్రకటించిన విధంగా అమ్మఒడి అనే పథకం అందరికీ వర్తిస్తుంది. పిల్లలను బడికి పంపితే ఆ తల్లులకు రూ. 15 వేలు ఇస్తాం. అదే విధంగా ఫీజురియంబర్స్‌మెంట్‌ పథకంతో ఉన్నత చదువులు చదివిస్తాం. బయట ప్రాంతాలకు వెళ్తే ఖర్చులకు ఏడాదికి రూ. 20 వేలు ఇస్తాం
–––––––––––––––––––
జ‌గ‌న‌న్న మీరు సీఎం అయితే చాలు
చంద్రబాబు మాటలు విని మోసపోయిన వారు చాలా మంది ఈ సభలో ఉన్నారు. చంద్రబాబు ఇప్పుడు ఎన్నికల్లో కేజీ బంగారం ఇస్తానన్నా నమ్మొద్దు. దయచేసి వైయస్‌ రాజశేఖరరెడ్డిని ఏ విధంగా సీఎం చేసుకున్నామో.. జగనన్నని సీఎం చేసుకోవాలి. నా భర్త చనిపోయిన లెటర్‌ తీసుకెళ్లి ఎమ్మార్వో ఆఫీస్‌కు వెళితే.. జన్మభూమి కమిటీలతో సంతకాలు పెట్టించాలన్నారు. ఆ పెన్షన్‌ కూడా వద్దు.. అవసరం అయితే కూలి చేసుకొని బతుకుతా.. జన్మభూమి కమిటీల దగ్గరకు పోయి సంతకం చేయించుకోను. నా ప్రభుత్వం.. వైయస్‌ జగన్‌ ప్రభుత్వం వచ్చినాక నా పెన్షన్‌ నాకు వస్తుందనే నమ్మకం. మనం జగనన్నను సీఎం చేసుకుంటే చాలు మనకు పెద్ద పెద్ద ఆస్తులు అవసరం లేదు. పేదరికం నుంచి బయటకు వస్తాం. 
------------------------------
 ఓసీలు ఏం చేశారన్నా..
పింఛన్లు ఎస్సీ, ఎస్టీలు, మైనారిటీలకు 45 ఏళ్లకే ఇస్తున్నారు. ఓసీలు ఏం చేశారన్నా అని ఓ మహిళా అడిగారు.
వైయస్‌ జగన్‌: ఒక్క వైయస్‌ఆర్‌ చేయూత పింఛన్‌ పథకం తప్ప..అన్ని పథకాలు అందరికీ వర్తింపజేస్తున్నామని వైయస్‌ జగన్‌ వివరించారు. మన ప్రభుత్వం వచ్చాక అందరికీ మేలు చేసేలా చూస్తామని మాట ఇచ్చారు.

 








Back to Top