జ‌గ‌న‌న్న..నీవే మాకు ర‌క్ష‌విశాఖ‌:  టీడీపీ పాల‌న‌లో మ‌హిళ‌ల‌కు ర‌క్ష‌ణ క‌రువైంద‌ని, వైయ‌స్ జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి అయితేనే మాకు ర‌క్ష‌ణ క‌లుగుతుంద‌ని విశాఖ మ‌హిళ‌లు పేర్కొంటున్నారు. శ‌నివారం ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా ప‌లువురు మ‌హిళ‌లు వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసి రాఖీలు క‌ట్టి త‌మ అభిమానాన్ని చాటుకున్నారు. వైయ‌స్ఆర్‌సీపీ అధికారంలోకి వ‌స్తే.. మ‌ళ్లీ రాజ‌న్న‌ రాజ్యం వ‌స్తుంద‌ని, మ‌హిళ‌ల‌ను ల‌క్షాధికారుల‌ను చేస్తార‌ని, మాకు వైయ‌స్ జ‌గ‌న్ రక్షణ కల్పిస్తారంటూ విశాఖ జిల్లా మ‌హిళ‌లు పేర్కొంటున్నారు. పాద‌యాత్ర‌లో అడుగ‌డుగునా మ‌హిళ‌లు జ‌న‌నేత‌ను క‌లిసి త‌మ బాధ‌లు చెప్పుకుంటున్నారు. అన్నా..మీరు రావాల‌ని కోరుతున్నారు.  ఆదివారం రక్షాబంధన్ కావ‌డంతో  ఒక రోజు ముందే విశాఖ జిల్లా మ‌హిళ‌లు వేడుక‌లు జ‌రుపుకుంటూ జ‌న‌నేత వైయ‌స్ జ‌గ‌న్‌కు రాఖీలు క‌ట్టి అభిమానాన్ని చాటుకుంటున్నారు. మ‌హిళ‌లంద‌రికీ వైయ‌స్ జ‌గ‌న్ భ‌రోసానిస్తూ ముందుకు సాగుతున్నారు.Back to Top