జగనన్న రావాలి...వైయస్‌ఆర్‌ పాలన మ‌ళ్లీ కావాలి

విశాఖ‌:   దివంగ‌త  ముఖ్య‌మంత్రి వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి సువ‌ర్ణ‌యుగం మ‌ళ్లీ రావాలంటే వైయ‌స్ జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి కావాల‌ని విశాఖ మ‌హిళ‌లు కోరుతున్నారు. ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో శ‌నివారం ప‌లువురు మ‌హిళ‌లు వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిశారు.  ప్రభుత్వం తీవ్ర‌ అన్యాయం చేస్తుందని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. వైయస్‌ఆర్‌ హయాంలో  పావలా వడ్డీ రుణాలిచ్చి మహిళల ఆర్థిక ఎదుగుదలకు కృషి చేశారన్నారు. జ‌గ‌న‌న్న అధికారంలోకి వచ్చి మహిళా సాధికారితకు జీవం పోయాలన్నారు. వైయ‌స్ జ‌గ‌న్‌ అధికారంలోకి వ‌స్తేనే దివంగ‌త ముఖ్య‌మంత్రి వైయస్‌ రాజశేఖర్‌రెడ్డి సువ‌ర్ణ‌యుగం మ‌ళ్లీ వస్తుందని మహిళలంతా  విశ్వాసం వ్య‌క్తం చేశారు..
Back to Top