మామిడి తాండ్ర మహిళలను కలుసుకున్న వైయస్‌ జగన్‌తూర్పు గోదావరి: ప్రజా సంకల్ప యాత్ర 190వ రోజు తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో విజయవంతంగా కొనసాగుతోంది. ఆత్రేయపురం నుంచి వైయస్‌ జగన్‌ పాదయాత్ర ప్రారంభమైంది. మామిడి తాండ్ర తయారి చేసే మహిళలను వైయస్‌ జగన్‌ కలుసుకున్నారు. మామిడి తాండ్ర తయారి చేసే విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. కోల్డు స్టోరేజీలు, మార్కెంటింగ్‌ సౌకర్యం కల్పించాలని మహిళలు వైయస్‌ జగన్‌ను కోరారు. జీఎస్టీ మినహాయింపు కావాలని మహిళలు కోరారు. వారి సమస్యలు సావధానంగా విన్న వైయస్‌ జగన్‌ ..వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి రాగానే అన్ని సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. 
 
Back to Top