మహిళలకు రక్షణ కరువు


  రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైందని డ్వాక్రా సంఘం నాయకురాలు లక్ష్మీదేవి అన్నారు. అనంతపురం జిల్లాలో మహిళలకు తీవ్ర  అవమానాలు జరుగుతున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా బుధవారం డ్వాక్రా మహిళలు అనంతపురం రూరల్‌ మండలంలో వైయస్‌ జగన్‌ను కలిసి తమ బాధలు చెప్పుకున్నారు. ఈ సందర్భంగా డ్వాక్రా సంఘాల సభ్యులు మాట్లాడుతూ.. అబద్ధపు హమీలతో మహిళలను చంద్రబాబు మోసం చేశారని డ్వాక్రా మహిళలు మండిపడ్డారు. డ్వాక్రా రుణాలు ఒక్క రూపాయి కూడా మాఫీ కాలేదని మండిపడ్డారు. చంద్రబాబు పాలనలో అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. జగనన్న సీఎం అయితేనే డ్వాక్రా సంఘాలకు మంచి రోజులు వస్తాయని నమ్ముతున్నామని, వైయస్‌ జగన్‌కు అండగా ఉంటామని పేర్కొన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి పాలనలో పావలా వడ్డీకే రుణాలు అందాయని గుర్తు చేశారు. చంద్రబాబు ఇచ్చిన రుణమాఫీ వడ్డీలకే సరిపోవడం లేదని డ్వాక్రా సంఘం అధ్యక్షురాలు షమీమ్‌ తెలిపారు. చంద్రబాబు మోసం చేశారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. వైయస్‌ జగన్‌ రాకతోనే మహిళలకు న్యాయం జరుగుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.
 
Back to Top