స్పీకర్‌ వ్యాఖ్యలపై నిర‌సనాగ్ర‌హం

విజ‌య‌వాడ‌: మహిళలు వంటింటికే పరిమితమైతే వేధింపులు ఉండవని మహిళలను అవమానించేలా అసెంబ్లీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు చేసిన వ్యాఖ్యలను వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది.  శుక్ర‌వారం విజ‌య‌వాడ న‌గ‌రంలో వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కుడు వెల్లంప‌ల్లి శ్రీ‌నివాస్ ఆధ్వ‌ర్యంలో నిరస‌న ప్ర‌ద‌ర్శ‌న చేప‌ట్టారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ మహిళా పార్లమెంటును ఘనంగా నిర్వహిస్తామని చెబుతూనే స్పీకర్‌ కోడేల శివప్రసాదరావు మహిళలను అవమానించేలా వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. ఎన్నికలకు ముందు రుణమాఫీ, మద్యపాన నిషేధం అని కల్లబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు రాష్ట్రాన్ని రావణ కష్టంలా మారుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ మ‌హిళా నేత‌లు పాల్గొని బాబు, స్పీకర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Back to Top