మ‌హిళ‌ల‌కు వైయ‌స్ జ‌గ‌న్ శుభాకాంక్ష‌లు




 ప్రకాశం: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్‌ జగన్ మోహ‌న్ రెడ్డి మ‌హిళ‌ల‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు. ప్ర‌కాశం జిల్లాలో ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో ఉన్న వైయ‌స్ జ‌గ‌న్  మహిళా కార్యకర్తలతో కేట్‌ కట్‌ చేయించారు. ఈ  సందర్భంగా మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాల‌ని, అన్ని రంగాల్లో ముందుండాల‌ని ఆకాంక్షించారు. వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన పాదయాత్ర ప్రకాశం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతుంది. గురువారం ఉదయం  వైయ‌స్‌ జగన్‌ సంతరావురు శివారు నుంచి పాదయాత్రను ప్రారంభించారు. అక్కడి నుంచి రాధాకృష్ణ నగర్‌, అంబేద్కర్‌ కాలనీ మీదుగా వేటపాలెం వరకు పాదయాత్ర కొనసాగుతుంది. దారిపొడవునా రాజన్న బిడ్డకు ప్రజలు ఘనంగా స్వాగతం పలుకుతున్నారు. జననేత అడుగులో అడుగు వేస్తూ ప్రజలు పాదయాత్రలో పాల్గొంటున్నారు.  ప్రజాసంకల్పయాత్రలో రాజన్న బిడ్డ ఇప్పటివరకు  1,444.7 కిలోమీటర్లు నడిచారు.  

తాజా ఫోటోలు

Back to Top