మహిళా సదస్సును మహానాడులా మార్చారు

 • చంద్రబాబు నాయుడు  మహిళా వ్యతిరేకి
 • బాబు రావణాసుర పాలనపై మహిళలంతా ఉద్యమించాలి
 • పోలీస్ వ్యవస్థ బాబుకు బానిసలుగా, టీడీపీ బౌన్సర్ లా పనిచేయడం దారుణం
 • బాబు, డీజీపీలు విజయవాడలో మకాం వేశాకే మహిళలపై దారుణాలు
 • మహిళలకు జరుగుతున్న అన్యాయంపై న్యాయపోరాటం చేస్తాం
 • వైయస్సార్సీపీ మహిళా అధ్యక్షురాలు, ఎమ్మెల్యే ఆర్కే రోజా

విజయవాడః చంద్రబాబు పాలనలో మహిళలకు రక్షణ కరువైందని వైయస్సార్సీపీ ఎమ్మెల్యే, పార్టీ మహిళా అధ్యక్షురాలు ఆర్కే రోజా మండిపడ్డారు. అన్యాయానికి గురైన మహిళలకు అండగా బిగ్ బాస్ లా నిలవాల్సిన డీజీపీ బాబుకు బానిసలా మారారాని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు రావణాసుర పాలనపై మహిళలంతా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో మహిళలపై ప్రభుత్వ అరాచకాలను ఎండగడుతూ న్యాయపోరాటం సాగిస్తామని విజయవాడలో పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో రోజా చెప్పారు. ఇంకా ఆమె ఏమన్నారంటే...
 • మహిళా పార్లమెంటేరియన్ సదస్సును బాబు మహానాడులా మార్చేశాడు.  మహిళా సమస్యలపై మాట్లాడే వారిని ఏ ఒక్కరిని మీటింగ్ కు రానీయలేదు. తన ప్రభుత్వాన్ని పొగిడి భజన చేసేవారిని ఆహ్వానించి చంద్రబాబు నాయుడు మహిళా సదస్సును నిర్వీర్యం చేశారు. కేవలం తన కుటుంబసభ్యులకు పరిమితం చేసి కిట్టీ పార్టీలా మార్చేసిందని జాతీయ మీడియా కూడా ఏకిపారేస్తే నిస్సిగ్గుగా మీడియా అమ్ముడుపోయిందని బాబు చెప్పడం ఆయన దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం. ఇన్నేళ్లు ఆయనకు భజన కొట్టిన మీడియాను ఎంతకు కొన్నాడో  బాబు చెప్పాలి. 
 • రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిపాలన సాగుతుందా...?బాబు ముసుగేసుకొని హిట్లర్ పాలన సాగిస్తున్నాడో అర్థం కావడం లేదు. అడుగడుగునా పోలీసులందరూ టీడీపీ బౌన్సర్ లాగా పనిచేస్తున్నారు.  ప్రతిపక్షంపై గానీ, టీడీపీలో అన్యాయమైపోతున్నవాళ్లు ఎవరు మాట్లాడినా బాబు పోలీసులతో అడ్డంగా అణగదొక్కుతున్నాడు. మహిళా ఎమ్మెల్యేగా తన హక్కుల్ని ఏపీ పోలీసులు ఎలా భంగం కలిగించారో అందరూ కళ్లారా చూశారు.
 • మహిళా సదస్సుకు స్పీకర్ పంపిన  ఆహ్వానం మేరకు తాను వస్తుంటే అక్రమంగా నిర్బంధించారు. ఓ ఎమ్మెల్యేలను అన్యాయంగా నిర్బంధించడం చూసి దేశం మొత్తం నివ్వెరపోయింది. మహిళా సాధికారత దిశగా సదస్సు జరుగుతున్నప్పుడు ప్రజాసంఘాలు, వివిధ పార్టీల మహిళలు వచ్చినప్పుడే భిన్నస్వరాలు వినిపిస్తాయి. ఆరోగ్యవంతమైన డిస్కషన్ జరిగినప్పుడే మహిళా సాధికారత సాధ్యమవుతుంది.  29 రాష్ట్రాల నుంచి ఎమ్మెల్యేలు, విద్యార్థిసంఘాల లీడర్స్, ఉమెన్ యాక్టివెస్ట్ లు వచ్చారంటే అదీ లేదు. సదస్సులో ఉన్నవారంతా చంద్రబాబు నాయుడు కోడలు, వెంకయ్యనాయుడు కూతురు, టీడీపీ ఎంపీ కేశినేని కూతురు. స్పీకర్ కోడెల శివప్రసాదరావు కూతురు, కేసీఆర్ కూతురు, వెంకటగిరి ఎమ్మెల్యే రామకృష్ణ కూతురు.  ఇది కార్పొరేట్ మహిళా సాధికారత సదస్సా..?  కామన్ మహిళా సాధికారత సదస్సా అనేది అర్థంకాక జనాలు ఆశ్చర్యపోయారు. 
 • అతి దారుణంగా నన్ను హింసించారు. నేను ఈ రాష్ట్రంలో పుట్టలేదా..? ఎమ్మెల్యేగా పనిచేయడం లేదా..? రాష్ట్రంలో ఉండే హక్కు లేదా..? మహిళా సమస్యలపై మాట్లాడే హక్కు తనకు లేదా..? మహిళా సదస్సుకు వాళ్లు ఇచ్చిన ఆహ్వానం మేరకు వస్తుంటే నిర్బంధించి ఇంకో రాష్ట్రంలో వదిలేశారు. ఏపీలో ఉండే అర్హత మాకు లేదా...? డీజీపీ కనుసన్నల్లో ఇలాంటి దారుణం జరగడం బాధాకరం. బాబు కనుసన్నల్లో ఏది మంచి చెడో ఆలోచించకుండా  డీజీపీ చట్టవిరుద్ధంగా నడిచాడు.  అన్యాయం చేసిన వారికి బిగ్ బాస్ లా ఉండాల్సిన డీజీపీ బాబుకు బానిసలా పనిచేస్తున్నారు. పోలీసుల చర్యను సమర్ధిస్తున్నానని బాబు చెప్పడం దారుణం. పిల్లనిచ్చిన మామనే వెన్నుపోటు పొడిచిన చంద్రబాబునాయుడుకు డీజీపీ మీరు ఓ లెక్కకాదు. ఎందుకంటే ఓటుకు నోటు కేసులో ఇరుక్కుపోయిన తను చేసిన తప్పుడు పనిని పోలీస్ ఆఫీసర్ అనురాధ మీద రుద్ది ఆవిడను ట్రాన్స్ ఫర్ చేశారు. బాబు దగ్గర పనిచేస్తే మీరు కూడ ప్రజల దృష్టిలో విలన్ గా నిలిచిపోతారు. 
 • చంద్రబాబు, డీజీపీ విజయవాడలో మకాం వేశాకే రిషితేశ్వరి ఆత్మహత్య జరిగింది, కాల్ మనీ సెక్స్ రాకెట్ లో వందలాది మంది వ్యభిచార కూపంలోకి వెళ్లారు. కల్తీమద్యంతో ఎంతోమంది మహిళలు తాళిబొట్లు తెంచుకున్న దాఖలాలు విజయవాడ, గుంటూరులో జరిగాయి. సాక్షాత్తు డీజీపీనే చెప్పాడు.  మహిళలపై 2016లో 11 శాతం అఘాయిత్యాలు పెరిగాయని స్వయంగా డీజీపీనే చెప్పారు. అంటే రాష్ట్రంలో బాబు పాలన ఎలా ఉందో  అర్థమవుతోంది.  తనను నిర్బంధించడం మీ దిగజారుడు తనానికి నిదర్శనం. కర్నూలులో వివాహిత మహిళపై రేప్ జరిగితే మీకు కనిపించలేదా...? మహిళా సాధికారత జరిగిన రోజుల్లోనే కోడెల నియోజకవర్గం, బాబు ఉన్న ఏరియాలో 13ఏళ్ల మైనర్ బాలికపై టీడీపీ నాయకుల తమ్ముళ్లు రేప్ చేశారు. ఆ బీసీ మహిళ మీ ఆఫీసుల చుట్టూ తిరిగారు.  మీడియాలోనూ వచ్చింది. అది కనబడలేదా...? తనకు జరిగిన అన్యాయాన్ని జాతీయ మీడియా గుర్తించడం మా అదృష్టం. బాబు దారుణాలను ఇక్కడి మీడియా భయపడో, ఇంకోవిధంగానో చూపించలేకపోతోంది.

 • రోజా ట్రాక్ రికార్డ్ చూసి అడ్డుకున్నామని చెబుతున్నారు.  బాబు  మీ పార్టీలో పదేళ్లు పనిచేశా. ఏం విధ్వంసం సృష్టించానో చెప్పాలి. వైశ్రాయ్ లో ఎమ్మెల్యేలతో గుమిగూడి మీ ప్రభుత్వాన్ని కూల్చేశానా? ఎవరినైనా కాల్చానా? చింతమనేని లాగ అక్రమాన్ని అడ్డుకున్న మహిళా అధికారిణిని కొట్టానా, లేకపోతే మంత్రి రావెల లాగ సొంత పార్టీవారిని హింసించాలన్న ట్రాక్ రికార్డ్ నాకుందా..?  మీ అంతు చూస్తా, పాతేస్తానన్న బోమ ఉండ ట్రాక్ రికార్డ్ నాకుందా...? ఏం ట్రాక్ రికార్డుంది బాబు..? ఎమ్మెల్యేకే రక్షణ లేనప్పుడు సామాన్య మహిళకు అన్యాయం జరిగితే వారు ఏవిధంగా పోలీసు వ్యవస్థను న్యాయం కోరగలరు. నా హక్కులకు కలిగిన భంగాన్ని, పోలీసులు  బాబుకు బానిసలుగా మారిన తీరును ఎండగడుతూ న్యాయ పోరాటం చేస్తా. మహిళలంతా బయపడకుండా మీకు జరిగిన అన్యాయానికి ప్రభుత్వంపై తిరగబడి ప్రశ్నించాలి. చంద్రబాబు రావణాసుర పాలనపై మనమంతా పోరాడాలి. అందరికీ అండగా జగనన్న ఉంటాడు. ఆయన చూపించిన బాటలో మహిళా విభాగం మహిళలకు అండగా ఉంటుంది. 
 • ఓ మహిళకు హోంమంత్రి పదవి ఇచ్చి గౌరవించిన దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డిని మనం చూశాం. ఐదు మందికి ఎంపీ సీట్లు ఇచ్చిన మహిళా పక్షపాతి వైయస్ జగన్ ను చూశాం. గౌరవాధ్యక్షురాలిగా మహిళకు స్థానం ఇచ్చిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని మనం చూశాం. చంద్రబాబు మహిళా వ్యతిరేకి.  ముగ్గురు మంత్రుల ఫోటోలు కూడా సదస్సులో పెట్టలేదు.  బాబు, వెంకయ్య, కోడెల ఫోటోలు పెట్టుకున్నారు. మహిళా సమస్యలపై పోరాడే బృందాకారత్, మేధాపాట్కర్, మల్లు స్వరాజ్యం  లాంటి మేధావులు రాకుండా మీటింగ్ ఎలా పరిపూర్ణత పొందుతుంది. 
 • టీడీపీ సర్కార్  తనపై చేసిన తప్పు దేశం మొత్తం చూసింది. ఇక బాబు తప్పించుకోలేరు. మహిళా సమస్యలపై ప్రభుత్వం మెడలు వంచుతాం. తనను సస్పెండ్ చేస్తారని తెలిసి కూడా అసెంబ్లీలో మహిళా సమస్యలపై పోరాడాను. టాపిక్ ను డైవర్ట్ చేసేందుకే తనను సస్పెండ్ చేసి లేనిపోనివి రుద్ది చెడు చేయాలనుకున్నారు. మహిళలకు న్యాయం చేసేవరకు పోరాడుతాం. రిషితేశ్వరి విషయంలో మేం పోరాడబట్టే కొంతైనా రిలీఫ్ వచ్చింది. వాళ్ల తల్లిదండ్రులకు అపాయిట్ మెంట్ ఇవ్వకపోతే మేం వచ్చేలా చేశాం. అసెంబ్లీలో తాము చేసిన న్యాయపోరాటం వల్లే  ప్రిన్సిపల్ ను అరెస్ట్ చేశారు. వైజాగ్ లో బికినీషో, బీర్ పార్లర్ ను మేం అడ్డగించడానికి ప్రయత్నిస్తేనే బాబు భయపడి ఆపారు.  వన్ ఇయర్ సస్పెండ్ అయిపోయిన పర్వాలేదు గానీ ఆరోజు తాము చేసిన గొడవ వల్ల  కాల్ మనీ సెక్స్ రాకెట్  సద్దుమణిగిందంటే అది మా పార్టీ గొప్పతనం అని గర్వంగా చెప్పగలం. మద్యపానం మీద పెద్ద ఎత్తున ఉద్యమాన్ని తీసుకొస్తాం. ఇదే విజయవాడలో ఎంతోమంది తాళి తెగి వితంతులుగా మారారు. మద్యపానాన్ని అడ్డుపెట్టుకొని బాబు చేస్తున్న లూటీని కూడా ఆపే ప్రయత్నం చేస్తాం. మాకు జరిగిన అన్యాయనికి, పోలీసులు వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా న్యాయపోరాటం చేస్తాం. 
Back to Top