మహిళా సదస్సును కిట్టీ పార్టీగా మార్చేశారు

హైదరాబాద్ః మహిళా సదస్సును చంద్రబాబు ఓ కిట్టీ పార్టీగా మార్చేశారని వైయస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి ఎద్దేవా చేశారు. ప్రచార, ఆర్భాటం కోసమే బాబు మహిళా సాధికారత సదస్సు నిర్వహించి, తన భజనపరులతో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వాయించుకున్నారని విమర్శించారు. చంద్రబాబుకు మహిళలపై గౌరవం లేదని మండిపడ్డారు. మహిళలకు ఇచ్చిన హామీలను విస్మరించి, ప్రశ్నించిన వారి గొంతునొక్కుతూ చంద్రబాబు అప్రజాస్వామిక పాలన సాగిస్తున్నారని ధ్వజమెత్తారు.

Back to Top