చింతమనేని మీద సర్వత్రా ఆగ్రహం ఏలూరు) అంగన్‌వాడీ కార్యకర్తలపై ప్రభుత్వ విప్
చింతమనేని ప్రభాకర్ శుక్రవారం విరుచుకుపడిన ఘటనను మహిళా, కార్మిక, ప్రజా సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం తీవ్రంగా ఖండించింది.

 వైఎస్సార్ సీపీ
నాయకులు గంపల బ్రహ్మావతి మాట్లాడుతూ ఇటువంటి వారి శాసన సభ సభ్యత్వాన్ని రద్దు
చేయాలని డిమాండ్ చేశారు. టీడీపీకి మహిళలపై ఏమాత్రం గౌరవం ఉన్నా తక్షణమే అతనిని
అరెస్ట్ చేయాలన్నారు. రౌడీషీటర్, క్రిమినల్ కేసులు ఉన్న వ్యక్తికి ఆ పార్టీ పదవులు కట్టబెట్టడం తగదన్నారు.
తక్షణమే అంగన్‌వాడీలకు క్షమాపణ చెప్పాలన్నారు. ఐద్వా జిల్లా  అధ్యక్షులు సిహెచ్ రాజ్యలక్ష్మి మాట్లాడుతూ
మహిళా సాధికారిత గురించి ఉపన్యాసాలు ఇచ్చే ముఖ్యమంత్రి వెంటనే చింతమనేనిని పార్టీ
నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్ష పార్టీలకు చెందిన
వైఎస్సార్సీపీ, సీపీ ఐ, సీపీ ఎం పార్టీలకు చెందిన మహిళఆ నేతలు ఇందులో
పాల్గొన్నారు.

 

Back to Top