నా తండ్రిని ఆఖరి చూపు చూసుకుంటా
సైదాపురం: సౌదీలో మృతి చెందిన తన తండ్రి మృతదేహాన్ని ఆఖరి చూపు చూసుకునే భాగ్యం కల్పించాలని సైదాపురం మండలం కొమనేటూరు గ్రామానికి చెందిన జ్యోతి వైయస్‌ జగన్‌ను కలిసి కన్నీరు పెట్టుకుంది. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా కొమనేటూరు గ్రామానికి వచ్చిన జననేతను జ్యోతి కుటుంబ సభ్యులు కలుసుకున్నారు. ఈ సందర్భంగా తన బాధను జననేతకు చెప్పుకుంది. 2016లో తన తండ్రి అధిపతి బతుకుదెరువు కోసం సౌదీకి వెళ్లాడని జనవరి 11వ తేదీన తీవ్ర గుండెపోటుతో మృతి చెందినట్లు సమాచారం వచ్చిందన్నారు. తన తండ్రి మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురావాలని ప్రభుత్వానికి విన్నవించినా ఫలితం లేదన్నారు. అధిపతి పనిలో పెట్టుకున్న యజమాని పది రోజుల్లో మృతదేహం పంపిస్తానని చెప్పి, ఇప్పుడు పోస్టుమార్టం చేసి పంపిస్తే రూ. 2 లక్షల ఖర్చు అవుతుందని, నా దగ్గర డబ్బులు లేవని చెబుతున్నాడని వాపోయారు. మీరే ఎలాగైనా మృతదేహాన్ని తీసుకువచ్చే ప్రయత్నం చేయాలని జననేతకు మొరపెట్టుకున్నారు. 
Back to Top