కొడుకు మృతి చెందినా వర్తించని చంద్రన్న బీమా

చిత్తూరు: చంద్రన్న బీమా అందించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని బాధితురాలు ప్రజా సంకల్పయాత్రలో ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. వ్యాపకుంట మండలం మీదుగా సాగుతున్న ప్రజా సంకల్పయాత్రలో శారదమ్మ అనే మహిళ వైయస్‌ జగన్‌ను కలిసి తన సమస్యను చెప్పుకుంది. ఈ సందర్భంగా ఆమె మీడియా మాట్లాడుతూ.. చంద్రన్న బీమాకు రిజిస్ట్రర్‌ చేసుకున్న తరువాత తన కుమారుడు బస్సు యాక్సిడెంట్‌లో మృతి చెందాడని శారదమ్మ చెప్పారు. యాక్సిడెంట్‌ తరువాత తన కొడుకు పేరు లిస్ట్‌లో లేదని, చంద్రన్న బీమాకు మీరు అర్హులు కారంటూ అధికారులు చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రిజిస్ట్రేషన్‌ సమయంలో యాక్సిడెంట్‌ వంటి వాటికి రూ. 5 లక్షల బీమా వర్తిస్తుందని చెప్పారని, కానీ ఇప్పుడు అడిగితే.. ఇవ్వడం లేదన్నారు. అన్ని ఆఫీసుల చుట్టూ తిరిగినా బీమా ఇవ్వడం లేదని మండిపడ్డారు. ఉన్న ఒక్క కొడుకు కూడా మరణిస్తే ఎలా బతకాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ విషయంపై వైయస్‌ జగన్‌ను కలిశామని, న్యాయం జరిగే విధంగా పోరాడుతానని చెప్పారన్నారు. 
Back to Top