రుణమాఫీపై మంత్రులను నిలదీసిన మహిళలు

అనంతపురం: అనంతపురం జిల్లాలోని గుత్తిలో టీడీపీ మంత్రులకు చేదు అనుభవం ఎదురైంది. రుణమాఫీపై టీడీపీ మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, పల్లె రఘనాథరెడ్డి, పరిటా సునీతలను డ్వాక్రామహిళలు నిలదీశారు.  ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై కడిగిపారేశారు.  రుణాలన్నీ మాఫీ చేస్తామని ఓట్లు వేయించుకున్న మీరు.. అధికారం చేపట్టి రెండేళ్లైనా రుణాలు ఎందుకు మాఫీ చేయడం లేదని అడిగారు. ఇంతవరకు ఒక్క రూపాయి కూడా మాఫీ చేయలేదని మహిళలు మంత్రులను నేరుగా కడిగేయడంతో బిక్కముఖమేశారు.

Back to Top