టీడీపీ పాల‌న‌లో మ‌హిళ‌ల‌కు ర‌క్ష‌ణ క‌రువు

అనంత‌పురం:  తెలుగు దేశం పాల‌న‌లో మ‌హిళ‌ల‌కు ర‌క్ష‌ణ క‌రువైంద‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత‌లు మండిప‌డ్డారు. అనంత‌పురం జిల్లా జ‌ల్లిప‌ల్లిలో ఇటీవ‌ల‌ మ‌హిళ‌ల‌పై దాడి చేసిన టీడీపీ ఎమ్మెల్సీ ప‌య్యావుల కేశ‌వ్ అనుచ‌రుల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేస్తూ శుక్ర‌వారం వైయ‌స్ఆర్‌సీపీ నేత‌లు ఎమ్మెల్యే విశ్వేశ్వ‌ర్‌రెడ్డి, మాజీ ఎంపీ అనంత వెంక‌ట్రామిరెడ్డి, మాజీ  ఎమ్మెల్యే గుర్నాథ్‌రెడ్డి అనంత‌పురం ఎస్పీని క‌లిశారు. ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ..ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో  చ‌ట్టం టీడీపీ నేత‌లకు చుట్టంలా మారిందన్నారు. స‌మ‌స్య‌ల‌పై ప్ర‌శ్నించిన వారిని, చివ‌ర‌కు మ‌హిళ అని కూడా చూడ‌కుండా కాళ్ల‌తో విచ‌క్ష‌ణార‌హితంగా హింసించ‌డం దుర్మార్గ‌మ‌న్నారు. 
Back to Top