మహిళల గొంతునొక్కడమేనా సాధికారత

  • దేశ, విదేశీయుల ముందు స్వరాష్ట్ర మహిళలను అవమానిస్తున్న బాబు
  • ఎమ్మెల్యే రోజాను ఏకారణంగా అరెస్టు చేశారు
  • రోజా ఆచూకీ కోసం డీజీపీకి వైయస్‌ఆర్‌ సీపీ నేతల ఫిర్యాదు
  • విజయవాడ: రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష మహిళా ఎమ్మెల్యేల గొంతునొక్కడమేనా మహిళా సాధికారత అని ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి చంద్రబాబును ప్రశ్నించారు. మహిళా సాధికారతకు పెద్ద పీట వేస్తున్నామని చెబుతూ దేశ, విదేశ మహిళా మణుల మందు స్వరాష్ట్ర మహిళా ప్రజాప్రతినిధులను బాబు కించపరుస్తున్నారని ధ్వజమెత్తారు.అక్రమంగా అరెస్టు చేసిన వైయస్‌ఆర్‌ సీపీ మహిళా అధ్యక్షురాలు, ఎమ్మెల్యే ఆర్కే రోజా ఆచూకీ తెలిపాలని కోరుతూ డీజీపీ కార్యాలయానికి వైయస్‌ఆర్‌ సీపీ నేతలు పెద్ద సంఖ్యలో ర్యాలీగా వెళ్లారు. డీజీసీ సాంబశివరావును కలిసి వినతిపత్రం సమర్పించారు. అనంతరం ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి మీడియాతో మాట్లాడుతూ రాజ్యాంగం మనకు కల్పించిన వాక్‌ స్వాతంత్రాన్ని కూడా చంద్రబాబు ప్రభుత్వం హరిస్తోందని «ధ్వజమెత్తారు. జాతీయ మహిళా పార్లమెంటరీ సదస్సుకు ఆహ్వానించి ప్రతిపక్ష మహిళా ఎమ్మెల్యేలను చంద్రబాబు అవమానించారని మండిపడ్డారు. దీనికి చంద్రబాబు, స్పీకర్‌ బాధ్యత వహించాలన్నారు. హక్కు ప్రకారం ఏ వేదికపైనైనా మాట్లాడోచ్చు. సదుస్సుకు వెళ్లిన తరువాత లాండ్‌ ఆర్డర్‌కు ఆటంకాలు కలిగిస్తే చర్యలు తీసుకోవాలి కానీ ఎయిర్‌ పోర్టులోనే బందించి తీసుకెళ్లడాన్ని ఖండిస్తున్నామని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ఆజ్ఞల మేరకు పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదని ఎమ్మెల్యే రోజాను అరెస్టు చేసి చంద్రబాబు కళ్లకుకట్టినట్లు చూపించారని దుయ్యబట్టారు. చట్టసభలో ఉండే మహిళలకే రక్షణ లేదంటూ సాధరణ మహిళలకు ఎలా రక్షణ కల్పిస్తారని చంద్రబాబును ప్రశ్నించారు. సదస్సుకు హాజరై ఏమీ మాట్లాడకూడదని హామీ ఇస్తే రోజా ఆచూకీ తెలియజేస్తామని పోలీసులు చెబుతున్నారని, మహిళలపై జరుగుతున్న దాడులపై మాట్లాడే అర్హత ప్రతిపక్ష ఎమ్మెల్యేగా మాకు లేదా అని నిలదీశారు. ఎందుకు ఆహ్వానం పంపించి ఎందుకు అడ్డుకొని అవమానిస్తున్నారని ఫైరయ్యారు. చంద్రబాబు భజన చేస్తే తప్ప సదస్సుకు రానివ్వకూడదన్నట్లుగా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారన్నారు. 
    మహిళా సాధికారతకు చిచ్చుపెట్టిన చంద్రబాబు
    వైయస్‌ఆర్‌ సీపీ అధికార ప్రతినిధి కొలుసు పార్థసారధి
    చంద్రబాబు సర్కార్‌ గొప్పగా మహిళా పార్లమెంటరీ సదస్సు నిర్వహిస్తూ మహిళా సాధికారతకు చిచ్చుపెట్టిందని వైయస్‌ఆర్‌ సీపీ అధికార ప్రతినిధి కొలుసు పార్థసారధి ధ్వజమెత్తారు. ఎటువంటి నేరం చేయకపోయినా ప్రభుత్వ పెద్దలు ఊహించుకుంటే ఆ ఊహల ఆధారంగా కేసులు పెట్టే దుస్థితి రాష్ట్రంలో నెలకొందన్నారు. ఎమ్మెల్యే ఆర్కే రోజా ఎందుకు అరెస్టు చేశారోఎటువంటి ఆధారాలు చూపించలేని పరిస్థితిలో పోలీసులు ఉన్నారన్నారు. మహిళ సాధికారత అని చెప్పుకుంటూ మహిళలను అణచివేసే ధోరణిలో ప్రభుత్వం నడుస్తోందని మండిపడ్డారు. సోషల్‌ మీడియాలో వస్తున్న వధంతులను నమ్మి ప్రతిపక్ష పార్టీ మహిళా అధ్యక్షురాలును అరెస్టు చేయడం సిగ్గుచేటు వ్యాఖ్యానించారు. తమ తప్పులను బయటకురాకుండా ఉంటేందుకు ప్రభుత్వం పోలీసులను ఉపయోగించుకొని కుట్రలు చేస్తోందని దుయ్యబట్టారు. ఎలాంటి కారణాలు లేకుండా ఎమ్మెల్యే రోజాను అరెస్టు చేయడాన్ని పూర్తిగా ఖండించారు.  రోజాపై జరిగిన దుశ్చర్యను ప్రజల్లోకి తీసుకెళ్లి చంద్రబాబు ప్రభుత్వానికి బుద్ధి వచ్చేలా పోరాటం చేస్తామని హెచ్చరించారు. ర్యాలీగా వెళ్లి డీజీపీని కలిసిన వారిలో ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, పార్టీ సీనియర్‌ నేతలు జోగిరమేష్, గౌతమ్‌రెడ్డి, వెల్లంపల్లి శ్రీనివాస్, పుణ్యశీల తదితరులు పాల్గొన్నారు. 
Back to Top