శుభాకాంక్షలు

పీఎస్‌ఎల్‌వీ సీ-34 విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టిన ఇస్రో శాస్త్రవేత్తలకు  ఏపీ ప్రతిపక్ష నేత, వైయస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ అభినందలను తెలిపారు.  ఈ ప్రయోగం ఇస్రో సిగలో మరో కలికితురాయి అని ఆయన అభివర్ణించారు. ఈమేరకు వైయస్ జగన్ ట్విట్టర్ లో ట్వీట్ చేశారు.  ఈ ప్రయోగంలో పాల్గొన్నవారందరి పట్ల తాము చాలా గర్వంగా ఉన్నామని, ప్రతి ఒక్కరినీ అభినందిస్తున్నానని ఆయన ట్వీట్ చేశారు.

పీఎస్ఎల్వీ సి-34 రాకెట్ ద్వారా ఒకేసారి నింగిలోకి 20 ఉపగ్రహాలను విజయవంతంగా పంపి ఇస్రో మరో ఘనత సాధించిన విషయం తెలిసిందే. ఇంతకుముందు ఒకేసారి కేవలం 10 ఉపగ్రహాలను మాత్రమే పంపిన ఇస్రో.. ఇపుడు ఒకేసారి 20 ఉపగ్రహాలను ప్రయోగించింది. అందులో మూడు మాత్రమే స్వదేశీ ఉపగ్రహాలు కాగా, మిగిలిన 17 విదేశీ ఉపగ్రహాలు కావడంతో.. ఇది వాణిజ్యపరంగా కూడా చాలా విజయవంతమైన ప్రయోగంగా మిగిలింది.


Back to Top