మెగ‌సెసె గ్ర‌హీత‌కు శుభాకాంక్ష‌లు

ప్ర‌ముఖ ఉద్య‌మ‌కారుడు బెజ‌వాడ విల్స‌న్ కు ప్ర‌తిప‌క్ష నేత‌, వైయ‌స్సార్సీపీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ శుభాకాంక్ష‌లు తెలియ‌చేశారు. ఆయ‌న సేవ‌ల‌కు గుర్తింపుగా రామ‌న్ మెగ‌సెసె అవార్డుని ప్ర‌క‌టించారు.

క‌ర్నాట‌క‌కు చెందిన విల్స‌న్ .. స‌ఫాయి క‌ర్మ‌చారీ ఆందోళ‌న్ అనే స్వ‌చ్ఛంద సంస్థ‌కు జాతీయ స‌మ‌న్వ‌య‌క‌ర్త గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. పారిశుధ్య ప‌నుల్లో మాన‌వ వ‌న‌రుల్ని వినియోగించ‌టాన్ని వ్య‌తిరేకిస్తూ ఉద్య‌మాన్ని నిర్వ‌హిస్తున్నారు. జాతీయ స్థాయిలో ఈ ఉద్య‌మం గుర్తింపు పొందింది. ఇంత‌టి సేవలు అందిస్తున్న విల్స‌న్ కు అత్యుత్త‌మ అవార్డు కేటాయించ‌టంపై వైయ‌స్ జ‌గ‌న్ సంతోషం వ్య‌క్తం చేశారు. ఆయ‌న సేవ‌ల‌కు త‌గిన గుర్తింపు ల‌భించిన‌ట్ల‌యింద‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. 
Back to Top