కన్నీళ్లు తుడుస్తూ..ధైర్యం చెబుతూ

కర్నూలులో ఐదవరోజు వైయస్ జగన్ రైతు భరోసా యాత్ర
రైతు చాంద్‌బాషా కుటుంబానికి వైయస్‌ జగన్‌ పరామర్శ
గ్రామగ్రామాన జననేతకు ఘనస్వాగతం

బండి ఆత్మకూరు: అధైర్య పడొద్దు..అండగా ఉంటానని ఆప్పుల బాధ తాళలేక ఆత్మహత్య చేసుకున్న రైతు చాంద్‌బాషా కుటంబానికి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి భరోసా కల్పించారు. కర్నూలు జిల్లాలో వైయస్‌ జగన్‌ చేపట్టిన రైతు భరోసా యాత్ర ఐదో రోజు సోమవారం శ్రీశైలం నియోజకవర్గంలో కొనసాగింది. బండి ఆత్మకూరు మండలం బీ.కోడురు గ్రామంలో అప్పుల బాధ తాళలేక ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు చాంద్‌బాషా కుటుంబాన్ని వైయస్‌ జగన్‌ పరామర్శించారు.  ఈ సందర్భంగా మృతుడి భార్య, తల్లిదండ్రులు, పిల్లలను వైయస్‌ జగన్‌ ఓదార్చి..ధైర్యం చెప్పారు. చాంద్‌బాషా ఆత్మహత్యకు దారి తీసిన కారణాలను, కుటుంబ పరిస్థితులను, పొలాలు, అప్పుల గురించి ఆరా తీశారు. చాంద్‌బాషా కౌలుకు పొలాన్ని తీసుకొని పంటలు సాగుచేస్తుండగా 2014లో కురిసిన అకాల వర్షాలకు పంట దెబ్బతినింది. పంట సాగుకోసం వడ్డీ వ్యాపారుల వద్ద రూ.2.40 లక్షలు, నంద్యాలలోని కెనరా బ్యాంకులో మూడు తులాల బంగారం తాకట్టు పెట్టి రూ.60 వేలు రుణం తీసుకున్నాడు. పంట చేతికందకపోగా, చంద్రబాబు చేస్తానన్న పంట రుణాలు మాఫీ చేయకపోవడం, వడ్డీ వ్యాపారుల ఒత్తిడి అధికం కావడంతో ఆ బాధ తాళలేక చాంద్‌బాషా 2015 ఫిబ్రవరి 8న ఇంట్లో పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. అయితే ప్రభుత్వం ఇంతవరకు ఒక్క రూపాయి కూడా పరిహారం చెల్లించలేదు. అధికారులు విచారణ పేరుతో వచ్చి పోతున్నారే తప్పా..ఎలాంటి సాయం చేయకపోవడంతో ఆ కుటుంబం ఆర్థికంగా చితికిపోయింది. ఈ నేపథ్యంలో వైయస్‌ జగన్‌ వారికి ధైర్యం చెప్పి, అన్ని విధాల ఆదుకుంటానని హామీ ఇచ్చారు. అలాగే మహానంది మండలం కేంద్రమైన ఎం.తిమ్మాపురం గ్రామంలో రైతు దూదేకుల చిన్నస్వామి కుటుంబాన్ని వైయస్‌ జగన్‌ పరామర్శిస్తారు. 

మహానేత విగ్రహం ఆవిష్కరణ
బండి ఆత్మకూరు మండలం వెంగళ్‌రెడ్డిపేటలో అభిమానులు ఏర్పాటు చేసుకున్న దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని  వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మహానేత విగ్రహానికి పాలాభిషేకం చేసి, పూలమాల వేసి నివాళులర్పించారు.
 
జననేతకు ఘన స్వాగతం
కర్నూలు జిల్లా శ్రీశైలం నియోజకవర్గంలో వైయస్ జగన్ ఏ గ్రామానికి వెళ్లినా ఘన స్వాగతం లభిస్తోంది. ఐదో రోజు యాత్ర బండి ఆత్మకూరు మండలం లింగాపురం గ్రామం నుంచి ప్రారంభం కాగా, అక్కడి నుంచి ఓంకారం, కడమల కాల్వ, వెంగళరెడ్డిపేట వరకు రోడ్డు షో నిర్వహించారు. అనంతరం బి.కోడూరు గ్రామంలో అప్పుల బాధతో ఆత్మహత్యకు పాల్పడిన చాంద్‌బాషా కుటుంబాన్ని వైయస్‌ జగన్‌ పరామర్శించారు. అక్కడ నుంచి నేరుగా పుట్టుపల్లె, అబ్బీపురం మీదగా మహానంది మండలం బుక్కాపురం వరకూ రోడ్‌షో చేపట్టారు. ప్రతిగ్రామంలో జననేతకు గ్రామస్తులు అపూర్వ స్వాగతం పలికారు. ప్రతి చోట ఆయనకు పూలవర్షం కురిపించారు. చిన్నా,పెద్ద తేడా లేకుండా జననేతతో కరచాలనం చేసేందుకు, ఫోటోలు దిగేందుకు, సెల్ఫీలు తీసుకునేందుకు పోటీ పడ్డారు. వైయస్‌ జగన్‌ వెంట ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, శ్రీశైలం నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ బుడ్డా శేషారెడ్డి, నాయకులు కుందూరు శివారెడ్డి తదితరులు ఉన్నారు.
 

తాజా వీడియోలు

Back to Top